కమల్ సూపర్ అన్న బాలీవుడ్ స్టార్

Update: 2018-12-15 12:03 GMT
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన 'జీరో' డిసెంబర్ 21 న విడుదల కానుంది.  ఈ సినిమా లో షారూఖ్ ఒక మరుగుజ్జు పాత్రలో నటించిన విషయం తెలిసిందే.  అతి తక్కువ మంది నటులు మాత్రమే ఇలా మరుగుజ్జు పాత్రలో నటించారు.  'విచిత్ర సోదరులు'(1989) సినిమాలో కమల్ హాసన్ పోషించిన మరుగుజ్జు పాత్ర ఇప్పటికీ ఒక రిఫరెన్స్ గా నిలిచిపోయింది.

ఇదే విషయం ప్రస్తావిస్తూ షారూఖ్ ను రిపోర్టర్లు మరుగుజ్జు పాత్రకు కమల్ ను రిఫరెన్స్ గా తీసుకున్నారా? అని అడిగితే విజువల్ ఎఫెక్ట్స్ వల్ల అలాంటి కష్టాలేవి పడలేదని తెలిపాడు. "ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ లేని రోజుల్లో కమల్ ఆ పాత్ర పోషించారు. అయన ఆ పాత్ర కోసం ఎంత కష్టపడి ఉంటారో నేను అర్థం చేసుకోగలను..అలాంటి పాత్ర చేయాలంటే  కమల్ కు మాత్రమే సాధ్యం.  అలాంటి ప్రయోగాలు చేసే ధైర్యం మాకు లేదు." అంటూ ఓపెన్ గా చెప్పేశాడు.

ఏదేమైనా షారూఖ్ లాంటి బాలీవుడ్ స్టార్ ఇలా కమల్ ను ఆకాశానికెత్తేయడం గొప్పవిషయమే.  మొదటి నుండి షారూఖ్ ఖాన్ కు సౌత్ లెజెండ్స్ పట్ల ఎంతో గౌరవం ఉంది. మణిరత్నం సినిమాలో నటించాడు. 'చెన్నై ఎక్స్ ప్రెస్' సినిమాలో లుంగీ డ్యాన్స్ అంటూ రజనీకాంత్ ఫోటో పెట్టుకొని మరీ డ్యాన్స్ చేశాడు. ఇప్పుడేమో కమల్ లా ప్రయోగాలు చేసే ధైర్యం మాకు లేదని తేల్చాడు.  ఏదేమైనా కమల్ హాసన్ లా ప్రయోగాలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి.  ఈ జెనరేషన్ హీరోలకు నిజంగానే అది సాధ్యమయ్యే పని కాదు.   


Tags:    

Similar News