లుక్కులతో పిచ్చెక్కిస్తున్న ఆ ఇద్దరు.

Update: 2015-09-04 17:49 GMT
తమిళనాట మునుపటి తరాన్ని (ఆ మాటకొస్తే ఇప్పటికీ) రాజ్యమేలిన నటులు రజినీకాంత్, కమల్ హాసన్. ఒకరు స్టైల్, కమర్షియల్, మాస్ అంటూ విజయాలు సాధిస్తే మరొకరు వినూత్నం, విభిన్నం అంటూ ప్రేక్షకుల చేత జేజేలు అందుకున్నారు. కొత్తనీరు ఇండస్ట్రీకి చొచ్చుకొస్తున్న సమయంలో కూడా తమ క్రేజ్ ని మునుపటిలాగే కాపాడుకుంటున్నారంటే మాటలు కాదు.

అయితే వీరి గత చిత్రాలు భారీ డిజాస్టర్ లు, ఉత్తమ విలన్ గా కమల్ అలరించక పోగా, లింగడి గా రజినీ విసిగించాడు. ఆ సినిమాల ఫలితం తో నేటి ట్రెండ్ ని అర్ధం చేసుకుని ఈ ద్వయం తమ తదుపరి సినిమాలను స్టైలిష్ గా నేటి ట్రెండ్ కి అనుగుణంగా తెరకెక్కిస్తున్నారు.

చీకటి రాజ్యం పేరు తొ కమల్ కొత్త సినిమా ఒక్క రాత్రి లో జరిగే నేపధ్యంలో తెరకెక్కనుంది. ఈ సినిమా పోస్టర్ లలో సూటు, బూటు వేసుకుని, లిప్ లాక్ లు పెట్టుకుంటూ కమల్ ఇరగదీసాడు. రేసీ కధనంతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇక 'రంజిత్ పా' దర్శకత్వంలో రజిని కబలి సినిమాలో డాన్ పాత్ర లో అలరించనున్నాడు. అధికార కంగా విడుదల కాక పోయినా ఈ సినిమా ఫస్ట్ లుక్ లలో రజినీ యాటిట్యుడ్, స్టైల్ ప్రేక్షకులను పిచ్చెకిస్తున్నాయి. ఈ సినిమాలు విజయం సాధిస్తే పూర్వ వైభవం సొంతం చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. 
Tags:    

Similar News