అఫీషియల్: విశ్వరూపం 2 వస్తోంది

Update: 2017-04-23 04:34 GMT
కమల్ హాసన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందించిన చిత్రం విశ్వరూపం. ఎన్నో కష్టాలు అనుభవించి ఎట్టకేలకు 2013లో రిలీజ్ అయిన ఈ మూవీ.. ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. అయితే.. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత.. మూవీ రిలీజ్ విషయంలో అనేక అడ్డంకులు సృష్టించారనే టాక్ ఉంది.

మొదటి భాగం హిట్ అయినా.. రెండో భాగాన్ని రిలీజ్ చేయడంలో కమల్ హాసన్ విఫలమయ్యారు. నాలుగేళ్లుగా నానా తంటాలు పడుతున్నా విశ్వరూపం2 మాత్రం విడుదలకు నోచుకోలేకపోయింది. ఇప్పుడు కమల్ ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. 'విశ్వరూపం2 చిత్రాన్ని 2017 కేలండర్ ఇయర్ లోనే విడుదల చేసే బాధ్యతలను రాజ్ కమల్ ఇంటర్నేషనల్ తీసుకుందని ప్రకటించేందుకు చాలా సంతోషంగా ఉంది' అంటూ ప్రకటించారు కమల్ హాసన్. అయితే.. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ అంటే.. స్వయంగా కమల్ బ్యానరే.

విశ్వరూపంకు కమల్ హాసన్ తో పాటు.. పొట్లూరి వర ప్రసాద్ నిర్మాత. కానీ విశ్వరూపం2 విషయంలో మాత్రం పీవీపీ ఏం చేయలేకపోయారు. ఇప్పుడు పూర్తిగా నిర్మాణ బాధ్యతలను తానే తీసుకుని మరీ థియేటర్లలోకి తెచ్చేస్తున్నారు కమల్ హాసన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News