మెగా అల్లుడి ఫిలిం.. ఇదో అప్డేట్

Update: 2017-12-09 16:52 GMT
మెగాస్టార్ చిరంజీవి ఒక కథను ఫైనల్ చేస్తే ఆ సినిమాలో ఎదో ఒక కొత్త పాయింట్ ఉంటుందనే చెప్పాలి. ఇక అయన సపోర్ట్ తో వచ్చిన యువ హీరోలకు సలహాలను ఇస్తూ కెరీర్ లో ఎంతో హెల్ప్ చేస్తుంటారు. వారికి సంబందించిన మొదటి సినిమా వేడుకలకు కూడా మెగాస్టార్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ప్రస్తుతం అయన చిన్న అల్లుడు కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి సిద్దమవుతున్నాడు.

దీంతో హడావిడి మాములుగా ఉండదేమో అని అందరు అందుకున్నారు. కానీ మెగా హీరోలు మాత్రం సినిమా స్టార్ట్ అయ్యే వరకు ఎలాంటి హడావుడిలకు తావ్వివ్వకూడదని డిసైడ్ అయ్యారట. కానీ సైలెంట్ గా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఎందుకంటే సినిమాపై ఎటువంటి అంచనాలు లేకుంటేనే బెటర్ గా ఉంటుందని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. కానీ చిరంజీవి ఒక్కరే సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ మధ్యనే కళ్యాణ్ ట్రైనింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే మెగాస్టార్ దర్శకుడు రాజమౌళిని నిర్మాత సాయి కొర్రపాటిని కలిసి రీసెంట్ గా చర్చలు జరిపారట. సాయి కొర్రపాటి సినిమాను తెరకెక్కించడానికి రెడీగా ఉన్నారు.

ఇకపోతే అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి మెగాస్టార్ అధికారికంగా విషయాన్ని తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
Tags:    

Similar News