అంత ఈజీ కాదంటున్న చందమామ!

Update: 2019-09-20 10:08 GMT
టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో ఒకరు. రెగ్యులర్ అప్డేట్స్ తో అభిమానులతో టచ్ లో ఉండడమే కాదు..అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో లైవ్ చాట్ లో కూడా పాల్గొంటుంది.  తాజాగా మరోసారి అలానే ట్విట్టర్ లో #ఆస్క్ కాజల్ పేరుతో లైవ్ చాట్ లో పాల్గొంది. ఇంకేముంది.. ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చూపించడమే కాదు  ఇంట్రెస్టింగ్ ప్రశ్నలతో సంధించి కాజల్ నుండి సమాధానాలు రాబట్టారు.

ఒకరు "మీకు డెస్టినీ పైన నమ్మకం ఉందా?" అని అడిగితే "నేను విధిరాతను నమ్ముతాను. అయితే అలా అని పూర్తిగా దానిపై ఆధారపడను. ఎందుకంటే అలా చేస్తే మనం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తాం.. మన చేసే పనులకు జవాబుదారీతనం ఉండదు" అంటూ బదులిచ్చింది.   మరొకరు "ఐ లవ్ యూ కాజల్.  మీరు నన్ను పెళ్ళి చేసుకుంటారా? మీ జవాబు కోసం వేచి చూస్తున్నా" అని అడిగితే.. "కొంచెం ప్రయత్నం చేయాలి.  అంత సులువుగా జరిగేది కాదు" అంటూ సమాధానం ఇచ్చింది. జవాబు ఏదో సింపుల్ గా కనిపిస్తోంది కానీ 'దూకుడు' లో సమంతా చెప్పినట్టు "యుద్ధాలు జరగాలి.."టైపు లోనే ఉంది ఆన్సర్!

"మీ లవ్లీ స్మైల్ వెనక సీక్రెట్ ఏంటి?" అని అడిగితే..  "థ్యాంక్ యూ. స్మైల్ అనేది మీ మనసుకు ప్రతిబింబం లాంటిది. నిజాయితీగా నవ్వండి. ఒక హ్యాబిట్ గా మారడానికి నవ్వడం ప్రాక్టీస్ చేయండి" అంటూ అందమైన నవ్వు గుట్టువిప్పింది. "మీరు ఉదయం  నిద్రలేవగానే చేసేదేంటి? అని అడిగితే "హృదయన్ని గ్రాటిట్యూడ్(కృతజ్ఞత)తో నింపుకోవడం".   మరో నెటిజన్ 'కాలభైరవ నీ ప్రేమ కోసం 400 ఏళ్ళు ఎదురు చూడడం జరిగింది. నేను నీ లవ్ ఎమోజి కోసం నా జీవితామంతా వేచి చూస్తాను" అన్నాడు.. ఇక చందమామ లవ్ ఏమోజితో రిప్లై ఇచ్చేసి ఆ నెటిజన్ ను సంతోషపెట్టింది.
Tags:    

Similar News