సర్దార్ భామలు సెట్లోకి వచ్చేశారు

Update: 2015-10-04 10:38 GMT
పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి మామూలుగానే ఏ చిన్న అప్ డేట్ బయటికొచ్చినా అభిమానులు ఆగట్లేదు. అందులోనూ రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ రంగంలోకి దిగాడు.. పైగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఎన్నో అనుమానాలకు తావిచ్చిన సినిమా కావడంతో ఈ మూవీ ప్రోగ్రెస్ కి సంబంధించి ప్రతి చిన్న విశేషమూ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. మొన్నే ఈ మూవీలో ఐటెం సాంగ్ చేస్తున్న లక్ష్మీరాయ్.. పవన్ కళ్యాణ్ తో కలిసి సెల్ఫీ పోస్ట్ చేయగానే ట్విట్టర్ షేకైపోయింది. ఇప్పుడు లక్ష్మీరాయ్ కి కాజల్ అగర్వాల్ కూడా తోడైంది. ఇద్దరూ కలిసి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెట్లో జంటగా కనిపిస్తున్న దృశ్యం ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో హుషారు తెప్పిస్తోంది.

ఇటీవలే కాజల్ కూడా ‘గబ్బర్ సింగ్’ షూటింగ్ కు హాజరైంది. పవన్ కళ్యాణ్, ఆమె మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అదే సమయంలో లక్ష్మీరాయ్ పాట కూడా షూట్ చేశారు. ఈ సందర్భంగా ఈ గ్లామర్ తారలిద్దరూ కలిసి ఫొటోలకు పోజిచ్చారు. ఇద్దరూ గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గట్లేదని పిక్స్ చూస్తే అర్థమవుతోంది. సీనియర్ హీరోల్ని మినహాయిస్తే కాజల్ తెలుగులో దాదాపుగా అందరు పెద్ద హీరోలతో నటించింది కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం మిస్సయిపోయాడు. ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోతోంది. ఇక లక్ష్మీరాయ్ లాంటి సెకండ్ గ్రేడ్ హీరోయిన్ పవన్ పక్కన ఐటెం సాంగ్ చేసే అవకాశమంటే చిన్న విషయం కాదు. మరి ఈ ఇద్దరు భామలు ఈ అవకాశాల్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News