టీజర్ టాక్: జ్యో.. ఎవరికి పడిపోతుందో

Update: 2016-08-16 16:12 GMT
అవును.. ఇప్పుడు అందరి కళ్ళూ.. జ్యో అనబడే రెజీనా కసాండ్ర ఎవరికి పడిపోతుంది అని. అబ్బే ఇక్కడ ఇద్దరు కుర్రాళ్ళు ఆమెకు చాలా సీరియస్ గా లైన్ వేస్తున్నారులే. అందుకే ఎవరికి పడిపోతుంది అని అడిగింది. అసలింతకీ ఈ జ్యో కథేంటో చూద్దాం పదండి.

మాటలతో గారడీ చేసి ఎమోషనల్ గా కార్నర్ చేసి.. జ్యో ని తమ ప్రేమకు భానిసను చేయాలని ఇద్దరు కుర్రాళ్ళు పడే ఆరాటమే ఈ ''జ్యో అచ్యుతానంద''. నారా రోహిత్ - నాగ శౌర్య ఇద్దరూ అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ సినిమాలో వీరిద్దరూ ప్రేమలోకి దింపేద్దామని చూస్తోంది ఒక్కరినే. డెంటల్ డాక్టర్ గా పనిచేసే రెజీనా ఇద్దరిలోఎవరిని ప్రేమిస్తుంది అనే కథ మనం తెరమీదనే చూడలి. శ్రీనివాస్ అవసరాల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఈరోజే విడుదలైంది. చూడగానే ఒక సింపుల్ రొమాంటిక్ ఫీల్ నింపేసింది. ఓ యాంగిల్ లో చూస్తే 'ప్రేమదేశం' తరహా కథలా అనిపించే ఈ టీజర్.. ఇప్పుడు యూత్ కు బాగా ఎక్కేస్తోంది.

ఈ సినిమాతో కెరియర్ విషయంలో కాస్త స్లో అయిన రోహిత్ - శౌర్య ఇద్దరూ హిట్టు కొట్టాలని ఉవ్విళూరుతున్నారు. ముఖ్యంగా ఇది రొమాంటిక్ మూవీ కావడం.. అవసరాల అలాంటి సినిమాతో ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ చేసుకోవడం.. కలిసొచ్చే అంశాలు.
Full View

Tags:    

Similar News