మరో ఏడాదిలో జురాసిక్ ప్రపంచం

Update: 2017-06-23 04:43 GMT
రాక్షస బల్లులు మళ్లీ బతికొస్తే.. అనే ఆలోచనతో స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన చిత్రం జురాసిక్ పార్క్. ఇప్పటికీ  ఈ కాన్సెప్ట్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. తొలి భాగం నుంచి ఇప్పటివరకూ అన్నీ సెన్సేషనల్ హిట్స్ సాధించాయి. ఇప్పుడీ సిరీస్ లో లేటెస్ట్ మూవీ వస్తోంది. మూడు నెలల క్రితం జురాసిక్ వరల్డ్ గురించి అధికారికంగా వెల్లడించగా.. ఇప్పుడు టైటిల్ లోగోను రిలీజ్ చేశారు.

జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్డమ్ (Jurassic World: Fallen Kingdom) అనే టైటిల్ పై రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ లో.. చుట్టూ డైనోసార్ స్కెలిటన్స్.. ఎదురుగా ట్రెసిరాటాప్స్ స్కెలిటన్ కు ఎదురుగా నుంచున్న ఓ అమ్మాయి కనిపిస్తుంది. ఈ పాత్ర చేసిన చిన్నారి డీటైల్స్ ఇంకా రాలేదు కానీ.. ఇప్పుడు టైటిల్ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. జూన్ 22.. 2018న జురాసిక్ వరల్డ్ రెండో భాగం థియేటర్లలోకి రానుంది. సరిగ్గా రిలీజ్ డేట్ కి ఏడాది ముందు టైటిల్ ను అనౌన్స్ చేయడం విశేషం. జురాసిక్ వరల్డ్ లేటెస్ట్ భాగంలో కూడా మరింత సస్పెన్స్ ఉంటుందని చెబుతున్నారు మేకర్స్.

'ఈ ప్రయాణం మరింత సస్పెన్స్ తోను.. భయంకరంగాను ఉంటుంది. జురాసిక్ పార్క్ నుంచి అన్ని భాగాల మాదిరిగానే ఇది కూడా భయపెట్టే థీమ్ తోనే ఉంటుంది' అని చెబుతున్నాడు నిర్మాత కొలిన్ ట్రెవెరో. క్రిస్ ప్రాట్.. బ్రైస్ డల్లాస్ హోవార్డ్.. బీడీ వాంగ్ లు ఈ మూవీతో మళ్లీ జురాసిక్ ప్రపంచంలో అడుగు పెడుతుండగా.. ఇర్ఫాన్ ఖాన్ ఈ సారి మిస్ అవుతున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News