ఈయనేంది.. పవన్‌ అనుకుంటున్నాడా?

Update: 2015-10-13 13:30 GMT

Full View
ఒక పక్కన నడుం తిప్పుడూ డ్యాన్సు వేస్తూ.. మరో పక్కన హయ్‌ హోయ్‌ అంటూ పాట పడుతూ.. ఒకానొక టైమ్‌ లో కేవలం మేకింగ్‌ వీడియోతో సంచలన సృష్టించేశాడు పవన్‌ కళ్యాణ్‌. కాటం రాయుడా.. కదరీ నరసింహుడా.. అంటూ ఇరగదీశాడు. అప్పటికే ఎంతోమంది స్టార్‌ హీరోలు ఇలా సాంగ్‌ మేకింగ్‌ వీడియోతో వచ్చినప్పటికీ.. పవన్‌ చేసిన ఆ ఫీట్‌ మాత్రం ప్రత్యేకం. అత్తారింటికి దారేది సినిమా కోసం దేవిశ్రీ రికార్డు చేసిన ఆ వీడియోకు బాగా క్రేజ్‌ వచ్చింది.

ఇప్పుడిక సేమ్‌ టు సేమ్‌ ఏదో పవన్‌ కళ్యాణ్‌ ను ఇమిటేట్‌ చేస్తున్నాడా అన్నటు.. సీనియర్‌ కమెడియన్‌ జెపి ఎలియాస్‌ జయప్రకాష్‌ రెడ్డి కూడా ఒక వీడియోతో వచ్చాడు. లచ్చిందేవికి లెక్కుంది అనే సినిమా కోసం దర్శకుడు జగదీశ్‌ తలసిల.. సంగీత దర్శకుడు కీరవాణితో కలసి ఈ వీడియోను రికార్డు చేశాడు. 'మహాలక్ష్మి రావే.. విజయలక్ష్మి రావే.. ఎకౌంటు క్లోజు చేయవే' అంటూ సాగే ఈ పాటను జెపి బాగానే పాడాడు. లిరిక్‌ కూడా కామెడీగానే ఉంది. అయితే మేకింగ్‌ మాత్రం కాస్త నాసిరకంగా ఉంది. కాకపోతే ఇదేదో పవన్‌ కళ్యాణ్‌ కాటం రాయుడా సాంగ్‌ కు ఇమిటేషన్‌ లా ఉంది.

అయినా జెపి కూడా ఇలాంటి సాంగు చేసేస్తే.. అది పవన్‌ సాంగ్‌ రేంజులో హిట్టవ్వడానికి ఈయనేమన్నా పవన్‌ కళ్యాణా ఏంది అంటూ అభిమానులు కాస్త పెదవి విరుస్తున్నారు. అయినాసరే.. జెపి అండ్‌ గ్యాంగ్‌ మాత్రం.. ఈ పాటతో దమ్ము దులిపి ఆరేస్తాం అంటున్నారు. చూద్దాం మరి.

Tags:    

Similar News