అప్పుడు లంక బ్యూటి అప్సెటయ్యింది

Update: 2017-05-27 13:48 GMT
జస్టిన్ బీబర్ మ్యూజికల్ ఈవెంట్ మిగిల్చిన రోత ఇప్పటికీ ముంబాయ్ ని వదల్లేదు. జస్టిన్ పై అభిమానం, అతని సంగీతం అంటే పిచ్చి అభిమానులు గురించి కాదు ఇక్కడ చర్చ. ఆ షో నడిపిన విధానం మొత్తం మ్యూజిక్ అభిమానులుకు  ఒక చేదు అనుభవం మిగిల్చింది. కనీసం అక్కడకు వచ్చి చేరిన మ్యూజిక్ లవర్స్ కోసం కూడా జస్టిన్ పాట పాడకుండా ఏదో పెదాల అటు ఇటు ఆడించి తప్పుకున్నాడు. ఈ విషయంగా అక్కడకు వచ్చిన ఫాన్స్ కు తీవ్ర మనస్తాపం చెందారు.

సాదారణ అభిమాని పరిస్థితి ఎలా ఉన్న కనీసం స్టార్ అభిమానిని కూడా అక్కడ లెక్క చేయలేదట. బాలీవుడ్ స్టార్ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ కూడా ఆ షో కు వెళ్ళింది. కానీ ఆమెకు ఎదురైన సందర్భం కాస్త చేదుది అనే చెప్పాలి. అక్కడ సమాచారం ప్రకారం “జాక్వెలైన్ ఫెర్నాండెజ్ సింగర్ బీబర్ ను కలవాడినికి ప్రయత్నం చేసింది. కానీ అతని బౌన్సర్లు ఆమెను దగ్గరుకు రానివ్వలేదు. ఏమో అతనికి ఉన్న ఫాలోయింగ్ వలనో క్యూట్ ఇమేజ్ వలనో వీళ్ళు అలా చేశారు అనుకుందాం. ఇక్కడ ఆమె బాలీవుడ్ హీరోయిన్ కదా వాళ్ళకు ఆమాత్రం తెలిసి ఉండదా? జాక్వెలైన్ కూడా మొదటిలో ఇలానే అనుకుంది కానీ వాళ్ళ ప్రవర్తన జస్టిన్ ప్రవర్తన గమనించిన తరవాత ఆమె అక్కడ నుండి వెళిపోయింది'' అంటూ చెబుతున్నారు.

ఇకపోతే జస్టిన్ బీబర్ వస్తున్నాడు అనగానే టోటల్ బాలీవుడ్ ఎగబడిపోయింది. మామూలు హడావుడి చేయలేదు. కాని అందరికీ ఇలా దారుణమైన పంచ్ తగులుతుందని.. అసలు కనీసం బీబర్ తో కలిసే అవకాశం కూడా రాదని ఊహించలేదు. కాని బీబర్ మాత్రం.. కొందరు పెద్దలు ఆర్గనైజ్ చేసిన పార్టీలో పాల్గొన్నాడు.. అక్కడ కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలతో ఫోటోలు కూడా దిగాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News