మూడు పక్కా అంటున్న న్యాచురల్ స్టార్

Update: 2019-04-18 11:31 GMT
న్యాచురల్ స్టార్ నాని సినిమాలను చాలా స్పీడ్ గా సెట్ చేసుకుంటాడు.. అంతకంటే వేగంగా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడు.  క్వాలిటీలో రాజీ పడకుండా ఏడాదికి మూడు నాలుగు రిలీజులు ఉండేలా చూసుకోగలిగిన ఈ జెనరేషన్ స్టార్ హీరో నాని మాత్రమే.  అయితే 2018 లో నాని జోరు తగ్గిన సంగతి తెలిసిందే. దాంతోపాటూ ఫ్లాపులు కూడా పలకరించాయి.  నాని అభిమానులకు స్వీట్ న్యూస్  ఏంటంటే మళ్ళీ ఇప్పుడు నాని తనకు అచ్చొచ్చిన.. అలవాటైన పాత దారిలోకే వెళ్తున్నాడు.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ ఏడాది మూడు రిలీజులు ఉంటాయని నాని స్వయంగా వెల్లడించాడు.  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన నాని తాజా చిత్రం 'జెర్సీ' రేపు రిలీజ్ అవుతోంది.  ఇది కాకుండా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' సెట్స్ పై ఉందనే సంగతి తెలిసిందే.  ఈ సినిమా ఆగష్టు లేదా సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తారని సమాచారం.  ఇక మూడో సినిమా గురించి నాని వెల్లడించలేదు కానీ ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టిస్టారర్.  ఈ సినిమాను జూన్ లో లాంచ్ చేస్తారని.. ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్ ఉంది.  

నాని ఇలా మళ్ళీ సినిమాలు చేయడంలో జోరు చూపించడం అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుందనడంలో సందేహం లేదు. గతంలో ఇలాగే వేగంగా సినిమాలు కంప్లీట్ చేయడమే కాకుండా క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు కాబట్టి మరోసారి న్యాచురల్ స్టార్ అలాగే ప్రేక్షకులను అలరిస్తాడని ఆశించవచ్చు.



Tags:    

Similar News