జీరో పాట: హుస్న్ పర్చమ్ అంటూ తాట తీసింది!

Update: 2018-12-12 11:38 GMT
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ తాజా చిత్రం 'జీరో'.  ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కత్రిన కైఫ్.. అనుష్క శర్మ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమానుండి తాజాగా  హుస్న్ పర్చం.. అంటూ సాగే వీడియో సాంగ్ ను ఫిలిం మేకర్స్ విడుదల చేశారు. 

ఈ పాటకు ఇర్షాద్ కామిల్ సాహిత్యం అందించగా భూమి త్రివేది.. రాజా కుమారి పాడారు. సంగీత దర్శకుల ద్వయం అజయ్-అతుల్ ఈ పాటకు అరబిక్ టచ్ ఉండే స్టైల్ లో మంచి ట్యూన్ అందించారు.  ఫుల్ జోష్ లో ఉండే స్పెషల్ సాంగ్ లాగా ఈ పాటను రిచ్ సెట్.. పదుల సంఖ్యలో డ్యాన్సర్ల మధ్యలో చిత్రీకరించారు.  కత్రినా స్టెప్స్ మాత్రం సింప్లీ సుపర్బ్.  'ధూమ్ -3' లో కమ్లి సాంగ్ లో తన డ్యాన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన కత్రినా ఇప్పుడు మరోసారి హుస్న్ పర్చమ్ తో మరోసారి థ్రిల్ చేస్తోంది. 

ఇప్పటివరకూ రిలీజ్ అయిన రెండు పాటలకంటే ఈ మూడో పాటే ఆడియోలో చార్ట్ బస్టర్ గా నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.  ఈ పాటలో కత్రినా స్టెప్స్ కు సోషల్ మీడియాలో అప్పుడే ప్రశంసలు దక్కుతున్నాయి. తో అభీ దేర్ కిస్ బాత్ కీ.. ఏక్ బార్ హుస్న్ పర్చమ్ దేఖియే..!

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View

Tags:    

Similar News