బిజిల్ సెకండ్ లుక్ కూడా వచ్చేసిందోచ్

Update: 2019-06-22 06:26 GMT
తమిళ స్టార్ విజయ జూన్ 22 న అంటే.. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.  ఈ సందర్భంగా విజయ్ అభిమానులకు కానుకగా ఆయన కొత్త సినిమా #విజయ్63 ఫస్ట్ లుక్ ను నిన్న సాయంత్రం విడుదల చేశారు. 'బిజిల్' అనే టైటిల్ ను కూడా కన్ఫాం చేశారు.  నిన్న రాత్రి 12 గంటలకు సెకండ్ లుక్ ను కూడా రిలీజ్ చేసింది 'బిజిల్' టీమ్.

ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే.  మైఖేల్.. బిజిల్ అనే రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బిజిల్ ఫుల్ మాస్ గా కనిపిస్తుంటే మైఖేల్  మాత్రం ఒక ఫుట్ బాల్ క్రీడాకారుడిగా మోడరన్ గా స్టైలిష్ గా  కనిపిస్తున్నాడు. సెకండ్ లుక్ లో ఆ పాత్రలకు సంబంధించిన మరో రెండు షేడ్స్ ను చూపించారు.  ఈ సెకండ్ లుక్ లో మైఖేల్ ఫుట్ బాల్ లో స్టైల్ గా ఎగరేస్తూ నవ్వుతూ ఉన్నాడు.. మరో షేడ్ లో సీరియస్ గా ఉన్నాడు. ఇక బిజిల్ పాత్రకు సంబంధించి..పంచె కట్టులో కత్తి పట్టిన గెటప్ ఒకటైతే.. సూటు బూటు వేసుకొని స్టైల్ గా నిలుచున్నా గెటప్ మరొకటి.  మరి ఎందుకు ఇలా నాలుగు షేడ్స్ ఉన్నాయో మాత్రం సస్పెన్స్ గా ఉంచాడు దర్శకుడు.  

సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.  వివేక్.. జాకీ ష్రాఫ్.. ఆనంద్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఎజీఎస్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.   అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలు ఉన్నాయి.  విజయ్ -అట్లీ కాంబినేషన్ లో గతంలో తెరకెక్కిన 'తెరి'.. 'మెర్సల్' సినిమాలు సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి ఈ హ్యాట్రిక్ చిత్రంపైనే ఉంది.


Tags:    

Similar News