• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దుమారం: కరోనా వైరస్ పై...

దుమారం: కరోనా వైరస్ పై యంగ్ హీరో సిల్లీ కామెంట్

By - Tupaki Desk
Update: 2020-02-29 11:31 GMT
కరోనా వైరస్.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 78000 మందికి పైగా సోకింది. 2800మంది ఇప్పటి వరకూ మరణించారు. దీనివల్ల చైనా ఎక్కువగా ప్రభావితమైంది. అయితే ఇంతమంది ఇన్ని రకాలుగా భయపడుతున్న కరోనా వైరస్ మీద చాలా మంది ప్రముఖులు, సెలెబ్రెటీలు హీరోలు జోకులు విసరడం చర్చనీయాంశమవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ వైరస్ బారిన పడి చనిపోతామా అని వణికి  పోతుంటే యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మాత్రం ఈ వైరస్ పై సిల్లీ కామెంట్ చేయడం దుమారం రేపింది.

తాజాగా ఓ వ్యక్తి ట్విట్టర్ లో ‘కరోనా వైరస్ వల్ల స్టాక్ మార్కెట్ దారుణంగా పడి పోయిందని.. 2008 ఆర్థికమాంద్యం తర్వాత మళ్లీ ఇంతగా పడిపోయింది లేదు’ అని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ కు హీరో నిఖిల్ స్పందించాడు. ‘థ్యాంక్స్ టు కరోనా వైరస్.. స్టాక్స్ కొనుక్కోవడానికి ఇదే సరైన సమయం’ అని కామెంట్ చేశాడు.

దీనికి చిర్రెత్తుకొచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ హేమంత్ హీరో నిఖిల్ ను ఏకిపారేశాడు. ‘ఇలాంటి క్లిష్ట సమయంలో ఇలాంటి కామెంట్ ఇన్ సెన్సిటివ్ గా ఉంది బ్రో. చుట్టుపక్కల దేశాల ప్రజలు వైరస్ వల్ల చనిపోతుంటే భయపడి పోతుంటే ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు.. అర్థం చేసుకుంటావని అనుకుంటా ’ అని నిఖిల్ కు గట్టిగా క్లాస్ పీకాడు.

దీనికి నిఖిల్ కూడా సమాధానమిచ్చాడు.. ‘మనుషులను ఈ వైరస్ చంపలేదు. ఇంతమంది తాగుతున్నా సిగరెట్, మద్యం చంపుతుందా? ఇలాంటి ఫ్లూలు ఎన్ని వచ్చినా మనల్ని ఏమీ చేయలేవు. మన వ్యాధి నిరోధక శక్తి ఈ వైరస్ ను తట్టుకోగలదు.. ఫ్లూలు వచ్చి పోతుంటాయి’ అంటూ తనను తాను సమర్థించుకున్నారు.
Tags:    
  • Hero Nikhil Silly Comment on Corona Virus 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

తెలుగు హీరో 'సీన్' కోసం చర్చలు..?

2026-11-10 05:04 GMT

సూర్య@650+కోట్లు... అరుదైన రికార్డ్

2026-11-10 04:36 GMT

రామాయణ రెస్పాన్స్... జక్కన్న మహాభారతం టైమ్ వచ్చిందా?

2026-11-10 04:35 GMT

పదేళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యే టైం వచ్చిందా?

2026-11-10 04:35 GMT

'రంగ‌స్థ‌లం' చిట్టి బాబును..'పుష్ప‌' పుష్ప‌రాజ్‌ను మించేలా..!

2026-11-10 03:51 GMT

అత్త‌మ్మ‌తో అల్లు కోడ‌ళ్లు వెరీ స్పెష‌ల్ దీపావ‌ళి

2026-11-10 03:51 GMT

ఎందుకు ఇబ్బంది పెడతారు.. రేణు దేశాయ్ ఫైర్

2026-11-10 03:50 GMT

కోడ‌ళ్ల‌తో అక్కినేని స్పెష‌ల్ దీపావ‌ళి సంబ‌రాలు

2026-11-10 03:49 GMT

Bigg Boss Telugu: నామినేషన్స్ లో బిగ్‌ బాస్ అదిరిపోయే ట్విస్ట్!

2026-11-10 03:47 GMT

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

Copyright @2026

Powered by Blink CMS