కత్రినా పాత జీరో కు ఊపు తెచ్చిందే!

Update: 2018-12-14 17:30 GMT
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ 'జీరో' సినిమాతో డిసెంబర్ 21 న ప్రేక్షకులను మెప్పించేందుకు రానున్నాడు.  షారూఖ్ ఈ సినిమాలో ఒక మరుగుజ్జు పాత్ర పోషిస్తున్నాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క శర్మ.. కత్రిన కైఫ్ లు హీరోయిన్లు.  అనుష్క వీల్ చైర్ కు పరిమితమైన సైంటిస్ట్ పాత్రలో నటిస్తుండగా.. కత్రినా ఒక స్టార్ హీరోయిన్ పాత్రలో నటిస్తోంది.

ఈ సినిమా ప్రోమోస్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అసక్తిని రేకెత్తిస్తున్నాయి.  హీరో.. హీరోయిన్ల పాత్రస్వభావాలు..  ఆఫ్ బీట్ స్టైల్ రొమాన్స్ ను కమర్షియల్ సినిమాలో ప్రెజెంట్ చేయడం కొత్తగా అనిపిస్తోంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటి వరకూ మూడు పాటలు విడుదల కాగా లేటెస్ట్ సాంగ్ 'హుస్న్ పర్చమ్' జనాలను ఊపేస్తోంది. అజయ్ - అతుల్ చార్ట్ బస్టర్ ట్యూను కు కత్రీనా రెచ్చిపోయి స్టెప్స్ వేయడంతో ఇప్పటికే సూపర్ హిట్ అయింది. అతి తక్కువ సమయంలోనే ఈ పాటకు 20 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.  

ఈ పాట తో 'జీరో' సినిమా పై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.  ఈ మధ్య సరైన హిట్టులేక బాలీవుడ్ నెంబర్ రేసు లో పూర్తిగా వెనకబడిపోయిన షారూఖ్ ఖాన్ కు ఇది ఊరటనిచ్చే అంశమే. మరి ఈ సినిమా తో అయినా భారీ హిట్ సాధించి కింగ్ ఖాన్ అనిపించుకుంటాడా లేదా మరోసారి అందరినీ ఉసూరుమనిపిస్తాడా అనేది డిసెంబర్ 21 న తేలిపోతుంది.
Tags:    

Similar News