సినిమా చేయనని చెప్పేశాడట

Update: 2018-02-23 23:30 GMT
తకిట తకిట సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తెలుగబ్బాయి హర్షవర్ధన్ రానే. ఈ రాజమండ్రి కుర్రోడు హీరోగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఇతర స్టార్స్ సినిమాల్లో కీలక పాత్రలు చేశాడు, ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా నటించి తన సత్త చాటుకున్నాడు. హీరోగా కాకపోయినా తనదైన శైలిలో నటిస్తూ నటనాపరంగా మంచి మార్కులే అందుకుంటున్నాడు. అయితే ఈ యాక్టర్ కి హీరోగా కూడా కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి.

కానీ హర్షవర్ధన్ మాత్రం వెంటనే ఒప్పుకోవడం లేదు. అయితే గత కొన్ని నెలల క్రితం రచయిత శ్రీధర్ సీపాన చెప్పిన ఒక కథ నచ్చడంతో ఈ యువ నటుడు వెంటనే ఒకే చెప్పాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని కూడా స్టార్ట్ చేశారు. ఆ ప్రెజెక్ట్ కి బృందావనమండి అందరిది అనే టైటిల్ ను కూడా సెట్ చేశారు. అయితే రీసెంట్ గా హర్షవర్ధన్ సినిమా లో నుంచి సడన్ గా తప్పుకున్నాడు అని తెలుస్తోంది. అందుకు చిత్ర యూనిట్ పనితీరే అని తెలుస్తోంది.

ఎందుకంటే సినిమాలో మొదట కథానాయిక కోసం చాలా సెర్చ్ చేశారు. అయితే ఫైనల్ గా ఒకరిని సెట్ చేయడంలో కన్ఫ్యూజ్ అయ్యారట. రీసెంట్ గా సీరత్ కపూర్ ను మొత్తానికి ఒప్పించారట. కానీ ఇప్పుడు ఆమెను కథని మరొక హీరోయిన్ ని ఫిక్స్ చేసుకున్నారు. ఆమె రిచా పన్నై అని తెలుస్తోంది. అయితే హర్షవర్ధన్ ప్రీ ప్రొడక్షన్ పనుల ఆలస్యం వల్ల విసిగిపోయి తప్పుకుంటున్నట్లు చెప్పేశాడని సమాచారం. అది సంగతి.
Tags:    

Similar News