ఆ క్రికెట్ కామెంటేటర్ కు చిలసౌ నచ్చిందట

Update: 2019-05-23 05:46 GMT
హర్ష భోగ్లే పేరు తెలియని క్రికెట్ ప్రేమికులు దాదాపుగా ఉండరు.  కామెంటేటర్ గా ఆయన శైలిని అభిమానించేవారు చాలామంది ఉన్నారు. మొదట్లో బట్టతలతో కనిపించిన ఆయన తర్వాత ఒత్తైన హెయిర్ వీవింగ్ జుట్టుతో గెటప్ మార్చాడు. ఇప్పుడు అయన టాపిక్ ఎందుకు వచ్చిందంటే రీసెంట్ గా ఆయన ఒక తెలుగు సినిమా చూశారట. ఆ విషయం తెలుపుతూ ఒక ట్వీట్ చేశారు.

"చాలాకాలం తర్వాత ఒక తెలుగు సినిమా చూశాను #చిలసౌ.  సబ్ టైటిల్స్ ఉన్నాయి కానీ.. వాటితో అవసరం లేకుండా ఫాలో అయ్యాను.  నైస్ మూవీ" అంటూ ట్వీట్ చేశారు. ఆయన 13 గంటల పాటు ఫ్లైట్ జర్నీలో ఉన్నప్పుడు ఈ సినిమా చూశానని మరో ట్వీట్ లో చెప్పుకొచ్చారు.  సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ కాలేదు కానీ మంచి ప్రశంసలే దక్కాయి. ఇప్పుడు హర్ష లాంటి సెలబ్రిటీ కూడా మెచ్చుకోవడం గొప్ప విషయమే కదా.

ఇక ఈ ట్వీట్ కు రిప్లైగా ఒక నెటిజనుడు "మహర్షి చూడండి సర్" అని మరో నెటిజనుడు "జెర్సీ చూడండి సర్" అని కామెంట్స్ పెట్టారు. మరొకరు మాత్రం "ఈమధ్య తెలుగుకు సంబంధించిన ట్వీట్లు ఎక్కువగా చేస్తున్నావు. అక్కడేమైనా కొత్త ప్రాజెక్ట్ తగిలిందా?" అంటూ అనుమానం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News