ఆభరణాలతో అందంగా ఊరిస్తున్న ఆపిల్ బ్యూటీ!

Update: 2021-03-07 03:30 GMT
ఆపిల్ బ్యూటీ హన్సిక అంటే తెలియని గ్లామర్ ప్రియులు ఉండరు. ఎందుకంటే దాదాపు పదమూడు ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన దేశముదురు మూవీతో హన్సిక హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. అప్పుడు అమ్మడి వయసు పదహారేళ్లు. ఫస్ట్ మూవీతోనే గ్లామరస్ హీరోయిన్ అనే క్రేజ్ దక్కించుకుంది. కెరీర్ ప్రారంభించిన తక్కువ కాలంలోనే హన్సిక తెలుగులో మంచి స్టార్డం సొంతం చేసుకుంది. దాదాపు టాలీవుడ్ హీరోలందరి సరసన మెరిసింది. కానీ మధ్యలో వరుస ఫ్లాప్ లతో వచ్చిన స్టార్డంను నిలుపుకోలేకపోయింది. కొంతకాలంగా తెలుగులో సినిమాలు చేయడమే మానేసింది. అడపాదడపా మాత్రమే తెలుగులో సినిమాలు అంగీకరిస్తోంది.

అమ్మడు చివరగా నటించిన తెలుగు మూవీ తెనాలి రామకృష్ణ బీఏబిఎల్. సందీప్ కిషన్ కు జోడిగా నటించిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. లాభం లేదని ప్రస్తుతం హన్సిక లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మహా'లో నటిస్తుంది. జమీల్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హర్రర్ అంశాలతో ఉంటుందని టాక్. ఇదిలా ఉండగా ఈ ఆపిల్ బ్యూటీ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుందనే విషయం ప్రేక్షకులకు బాగానే తెలుసు. అందుకే ఎప్పుడెప్పుడు కొత్త పోస్ట్ పెడుతుందా అని వెయిట్ చేస్తుంటారు. తాజాగా హన్సిక ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పిక్ పోస్ట్ చేసింది. టాప్ టు బాటమ్ బ్లాక్ కాంబినేషన్ లో ఈ తెల్లతోలు పాప నిగనిగలాడుతుంది. ఎంతో అందంగా జ్యువలరీతో డిజైన్ చేసిన ఆమె దుస్తులలో మెడలో బంగారు ఆభరణాలతో చూడముచ్చటగా ముస్తాబైంది. అలాగే ముద్దుగా ఫోటోకు పోజిచ్చి ఫ్యాన్స్ ను ఖుషి చేస్తోంది.
Tags:    

Similar News