అసలు మహేష్‌ ను అడగనేలేదు

Update: 2015-10-07 01:30 GMT
గుణశేఖర్ సెల్యూలాయిడ్ రుద్రమదేవి రిలీజ్ కి దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ పెరుగుతోందంటున్నాడు డైరెక్టర్ గుణశేఖర్. ఈ మూవీ మొదలుపెట్టినప్పటి నుంచి రుద్రమపాత్రకు ఎంత ప్రాధాన్యత వచ్చిందో.. గోన గన్నారెడ్డి కేరక్టర్ కీ అంతే ప్రచారం లభించింది. ఆ పాత్రకోసం ఫలానా వాళ్లను గుణ అడిగాడని, వాళ్లు కాదన్నారంటూ చాలా మంది స్టార్ హీరోల పేర్లే వినిపించాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మహేష్ బాబు గురించే.

మహేష్ కి, గుణకి మంచి రిలేషన్ ఉంది. గుణశేఖర్ డైరెక్షన్ లో షార్ట్ పీరియడ్ లో మూడు సినిమాలు చేశాడు టాలీవుడ్ సూపర్ స్టార్ . ఒక్కడు బ్లాక్ బస్టర్ కాగా.. అర్జున్ మూవీ పర్వాలేదు అనిపించు కొంది ..  సైనికుడు ఘోరంగా ఫెయిలయ్యాయి. మామూలుగా ఫ్రెండ్లీ నేచర్ ఉండే మహేష్ కూడా.. ఆ కోపంతోనే గోన గన్నారెడ్డి పాత్ర చేయనని చెప్పాడంటూ బాగానే వార్తలొచ్చాయి అప్పట్లో. అందరూ ఈ విషయం మాట్లాడుకున్నపుడు నోరు మెదపని గుణ.. ఇప్పుడు రిలీజ్ టైంలో ఒక్కొక్కటి గా అసలు సంగతులు చెబ్తున్నాడు.

మహేష్ తో తనకు అలాంటి అనుభవం ఏం లేదని తేల్చేశాడు గుణశేఖర్. అనవసరంగా మహేష్‌ ను ఆడిపోసుకోనవసరంలేదు.. అసలు గోన గొన్నారెడ్డి రోల్‌ కోసం అతడిని ఎప్రోచ్‌ కూడా కాలేదని చెప్పాడు గురుడు. ఈ పాత్ర తాను చేస్తానంటూ.. స్వచ్ఛందంగా అల్లు అర్జున్ ముందుకొచ్చాడని, అందుకే బన్నీతోనే చేయించానని చెప్పాడు గుణ. ఈ డైరెక్టర్ ఇచ్చిన వివరణతో.. మహేష్ పై ఉన్న బ్లాక్ మార్క్ తొలగిపోయినట్లే ఇక.
Tags:    

Similar News