మెగా హీరోకి విలన్ గా ఎన్టీఆర్!!

Update: 2016-05-01 04:09 GMT
నందమూరి తారకరత్న.. ఇప్పుడు సూపర్ క్రేజ్ సంపాదించేసుకున్నాడు. హీరోగా అంతగా సక్సెస్ కాలేకపోయిన ఈ నందమూరి కుర్రాడు.. విలన్ గా మాత్రం తన మార్క్ చూపిస్తున్నాడు. గతంలో అమరావతి చిత్రంలో విలన్ గా మెప్పించిన ఈ నందమూరి హీరో.. రీసెంట్ గా రాజా చెయ్యి వేస్తే లోనూ విలన్ గా అదరగొట్టేశాడు.

రాజా చెయ్యి వేస్తేలో హీరో పాత్రకు మించి విలన్ రోల్ కే గుర్తింపు వచ్చిందంటే.. తారకరత్న విశ్వరూపం ఏ రేంజ్ లో చూపించాడో అర్ధమవుతుంది. ఇప్పుడు తారకరత్న దగ్గరకు విలన్ రోల్ చేయాలంటూ మరో ఆఫర్ వచ్చిందట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో.. సాయిధరం తేజ్ హీరోగా చేయనున్న మూవీలో తారకరత్నకు విలన్ రోల్ ఆఫర్ చేశారట. ఈ ప్రాజెక్టుపై తారకరత్న ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా.. ఇంకా తుది నిర్ణయం మాత్రం చెప్పలేదని తెలుస్తోంది.

నారా రోహిత్ కి విలన్ గా అంటే.. ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయ్ కాబట్టి ఓకే. కానీ మెగా హీరోకి విలన్ గా చేయడమంటే.. నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయాలను కూడా కన్సిడర్ చేయాలి. అందుకే ఆలోచిస్తున్నాడట తారకరత్న. అయితే.. తేజు - తారకరత్నల మధ్య మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ ఏంటో.. రాజా చెయ్యి వేస్తే ముందు ప్రూవ్ అయిపోయింది. తారక్ అన్న అంటూ స్పెషల్ గా బెస్ట్ విషెస్ చెప్పాడు సాయిధరం తేజ్. ఈ ఈక్వేషన్స్ అన్నీ చూస్తే.. మెగా హీరోకి విలన్ గా నందమూరి కుర్రాడు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News