జెమిని జెంటిల్మన్.. ఆయనెవర్నీ వేధించలేదు

Update: 2018-05-21 05:01 GMT
అలనాటి నటి సావిత్రి జీవితంపై తీసిన మహానటి చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ, తాజాగా ఈ చిత్రంపై సావిత్రి కుటుంబసభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆయన కుమార్తె  కమల గణేశన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సావిత్రి చిత్రాన్ని తాను, తన సన్నిహితులు చూశామని..  సావిత్రి పాత్ర అద్భుతంగా ఉందని, కానీ తన తండ్రి జెమినీ గణేశన్ పాత్రను మాత్రం చెడుగా చూపించారని... నిజానికి ఆయన జెంటిల్‌మన్ అని ఆమె అన్నారు.

ఈ సినిమాలో జెమినీ గణేశన్ పెళ్లి చేసుకో అని సావిత్రి వెంట పడే విధంగా చూపించారని అన్నారు. జెమిని గణేశన్ ఆడవారిని వేధించే రకం కాదని ఆయన జెంటిల్ మాన్ అని కమల అన్నారు. నాన్నగారు చాలా అందగాడు.. చదువుకున్న వ్యక్తి.. ఆయన వెంటే ఆడవాళ్లు పడే వారు అని కమల అన్నారు. తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్ కు వలే జెమినీగణేశన్ కూడా పెద్ద స్టార్ అని అన్నారు. అలాంటిది ఆయన పాత్రను గౌరవప్రదంగా చూపించలేదని కమల అసంతృప్తి వ్యక్తం చేశారు.

సావిత్రి సినిమా తీయాలి అనుకున్నప్పుడు జెమిని గణేశన్ కుటుంబాన్ని, సన్నిహితులని కూడా సంప్రదించాల్సింది. సావిత్రి తరుపు వారిని మాత్రమే సంప్రదించి సినిమా ఎలా తీస్తారు. అన్ని విషయాలు వారికే తెలుస్తాయా అంటూ కమల ప్రశ్నించారు. అయితే.. సావిత్రి గురించి మాత్రం ఆమె చాలా మంచిగా చెప్పారు. సావిత్రి అమ్మ చాలా మంచి వారని, తమని సొంత బిడ్డల్లాగే చూసుకునేవారని కమల అన్నారు. 

సావిత్రి, జెమిని గణేశ్  మధ్య విభేదాలు తలెత్తడానికి కారణం తనకు తెలుసు అన్నారు. సావిత్రమ్మకు స్టార్ స్టేటస్ తలకు ఎక్కిందని తెలిపారు. అందువలనే సినిమాలు నిర్మించవద్దని జెమిని గణేశన్ చెబుతున్నా సావిత్రమ్మ వినిపించుకోలేదని అన్నారు. ఆ తరువాత ఇద్దరూ విడిపోయాక సావిత్రమ్మ మద్యానికి బానిస అయ్యారని, ఆ తరువాత బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆమె తెలుసుకోలేకపోయారని కమల అన్నారు..
Tags:    

Similar News