శాతకర్ణి రూటు.. బాహుబలికి సెపరేటు

Update: 2016-12-03 17:30 GMT
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో బాహుబలి2.. గౌతమిపుత్ర శాతకర్ణిలకు పోలిక ఉంటుంది. ఒకటి జానపదం అయితే.. రెండోది చారిత్రకం. రెండిటికీ గ్రాఫిక్స్ చాలా ముఖ్యం. రెండు సినిమాల్లోనూ రాజుల కథలే నడుస్తాయి. అలాగే యుద్ధాలే ఈ చిత్రాలకు చాలా కీలకమైన పాయింట్స్. పోలికలు బోలెడన్ని ఉన్నా.. వాటిని ప్రమోట్ చేసుకోవడంలో దర్శకుల రూటు సెపరేట్ గా ఉండడం విశేషం.

గౌతమిపుత్ర శాతకర్ణి విషయంలో.. ఏ విషయాన్నీ దాచిపెట్టేందుకు దర్శకుడు క్రిష్ కానీ.. సినిమా యూనిట్ గానీ ప్రయత్నించడం లేదు. చివరకు కీలకమైన బాలకృష్ణ లుక్ తో పాటు.. హీరోయిన్ శ్రియ.. రాజమాతగా నటిస్తున్న హేమమాలిని లుక్స్ ని కూడా రిలీజ్ చేసేశారు. మరోవైపు తరచుగా సినిమాకు సంబంధించిన పలు స్టిల్స్ ను రిలీజ్ చేస్తూ వార్తల్లో శాతకర్ణి వార్తల్లో నానేలా చేస్తున్నారు. కానీ బాహుబలి విషయంలో మాత్రం ముందు నుంచి అంతా గోప్యంగానే సాగుతోంది. కనీసం సెట్స్ నుంచి ఓ ఫోటో కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు.

మరోవైపు జక్కన్న అండ్ టీం కూడా వేటినీ రిలీజ్ చేయడం లేదు. ఇప్పటికే బాహుబలి వ్యూహం ఓ సారి క్లిక్ అయింది. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణికి అవలంబిస్తున్న వ్యూహం.. మూవీ రేంజ్ ని పెంచుతోంది. కానీ.. బాహుబలితో పాత్రలన్నీ తెలిసిపోయాక.. మళ్లీ సీక్రెసీ ఎందుకు పాటిస్తున్నారో.. ఆ జక్కన్నే చెప్పాలి. అయినా.. కాసిన్ని ఫోటో స్టిల్స్ బయటకు వస్తే సినిమాపై హైప్ తగ్గిపోతుందా? ఫుటేజ్ లీక్ అయినా జనాల్లో ఆసక్తి కనిపిస్తోంది కదా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News