శ్రియా బర్త్ డే కానుకగా 'గ‌మ‌నం' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌...!

Update: 2020-09-11 05:00 GMT
సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా హీరోయిన్ గా కొనసాగుతోంది అందాల శ్రియా శ‌ర‌ణ్. అందంతో పాటు అభినయం క‌ల‌బోసిన న‌టీమ‌ణుల్లో ముందు వ‌రుస‌లో ఉండే శ్రియా శ‌ర‌ణ్‌ స్టార్ హీరోలందరి సరసన నటించింది. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు చేసిన శ్రియా ఇప్పటికీ లీడ్ రోల్స్ లో నటిస్తూ కొత్త హీరోయిన్స్  పోటీగా నిలుస్తోంది. ప్రేక్ష‌కుల ఆరాధ్య తార‌గా రాణిస్తూ వ‌స్తున్న శ్రియా మరో వైవిద్యభరితమైన సినిమాతో ముందుకొస్తున్నారు.  

సుజ‌నా రావు దర్శకత్వం వహిస్తున్న రియ‌ల్ లైఫ్ డ్రామా ''గ‌మ‌నం'' చిత్రంలో శ్రియా శ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈరోజు శ్రియా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 'గ‌మ‌నం' మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ ను క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌ లో శ్రియా సంప్రదాయబద్ధంగా చీర క‌ట్టుకొని, మెడ‌లో మంగ‌ళ‌సూత్రం ధరించి ఒక అతి సాధార‌ణ గృహిణిలా క‌నిపిస్తున్నారు. ఏ విష‌యం గురించో తీవ్రంగా ఆలోచిస్తున్న‌ట్లు ఆమె ముఖంలోని భావాలు తెలియ‌జేస్తున్నాయి. మొత్తానికి ఇంతకముందు చేయ‌ని పాత్ర‌లో శ్రియ క‌నిపించ‌నున్నార‌ని అర్థం అవుతోంది.

''గ‌మ‌నం'' చిత్రానికి మాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు రాస్తున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్‌ గా ఈ చిత్రానికి ప‌నిచేస్తున్న జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. నిర్మాత అవ‌తారం కూడా ఎత్తి, ర‌మేష్ క‌రుటూరి - వెంకీ పుష‌డ‌పు ల‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్త‌యిన 'గ‌మ‌నం' చిత్రానికి సంబంధించి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో ఈ చిత్రంలో ప‌నిచేస్తున్న తారాగ‌ణం వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.
Tags:    

Similar News