ఫైనల్ గా రంగంలోకి దిగిన స్టైలిష్ స్టార్..

Update: 2019-04-24 06:43 GMT
ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్సే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ఈరోజే ప్రారంభం కానుంది.  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్ నగరంలోని పోలీస్ లైన్స్ ఏరియాలో ప్రారంభం అవుతోంది.

పోయినేడాది సమ్మర్ లో రిలీజ్ అయిన 'నాపేరు సూర్య' సినిమా తర్వాత ఇప్పటివరకూ బన్నీ మరో సినిమాలో నటించలేదనే సంగతి తెలిసిందే.  అంటే దాదాపుగా ఏడాది తర్వాత బన్నీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇది నిజంగానే అభిమానులకు గుడ్ న్యూస్. ఈ సినిమాకు 'అలకనంద' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.  బన్నీ - పూజా హెగ్డే కాంబో ఇది రెండో సారి కాగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా నటించడం కూడా ఇది రెండో సారి. ఈ సినిమాను గీతా ఆర్ట్స్.. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

బొమన్ ఇరాని.. మలయాళం నటుడు జయరాం.. టబు.. సునీల్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారట. ఒకవేళ మెగాస్టార్ 'సైరా' కనుక దసరాకు రిలీజ్ చేస్తే మాత్రం ఈ సినిమాను వేరే డేట్ లో రిలీజ్ చేస్తారు.  త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కే హ్యాట్రిక్ ఫిలిం కావడంతో ఫ్యాన్స్ ఫుల్ గా ఎగ్జైట్ అవుతున్నారు.


Tags:    

Similar News