ఫ్యాషన్ డిజైనర్ ఇలా ట్విస్టిచ్చాడేంటి?

Update: 2017-04-15 05:04 GMT
ఇప్పటివరకు దర్శకుడు వంశీ తీస్తున్న ''ఫ్యాషన్ డిజైనర్ S/o లేడీస్ టైలర్'' సినిమా మీద అంచనాలన్నీ ఒకలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం ఆ అంచనాలు ఇంకో తరహాలు మారిపోయాయ్.  నిన్ననే ఈ సినిమా తాలూకు తొలిపాటను రిలీజ్ చేశాడు వంశీ. అయితే ఈ సినిమా టైటిల్ విన్న వెంటనే ఒక తరహాలో రియాక్ట్ అయ్యే ప్రేక్షకులు.. విజువల్స్ చూడగానే మరో రకంగా రియాక్ట్ అయ్యారు.

నిజానికి ఫ్యాషన్ డిజైనర్ అంటూ పోష్‌ గా పేరు పెట్టగానే.. ఒకవేళ వంశీ ఏమన్నా మాంచి అర్బన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీశాడేమో అనుకున్నారందరూ. అయితే ఆయన మాత్రం యాథావిథిగా తన ఫేవరేట్ గోదావరి గట్టునే సినిమా తీశాడు. అదే ఇప్పుడు అందరికీ షాకిస్తోంది. నిజానికి ఈ పాట విజువల్స్ చూస్తే పోలవరం పాపికొండలు వగైరా ప్రాంతం అంతా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. అయితే వంశీ మరోసారి గోదారినే ఎంచుకోవడం చూస్తుంటే.. ఈ సీక్వెల్ కూడా ఒరిజినల్ లేడీస్ టైలర్ తరహాలో గ్రామీణ నేపథ్యంలో సాగే కథ అని చెప్పొచ్చేమో.

ఇకపోతే మణిశర్మ కంపోజ్ చేసిన పాటల్లోని తొలి సింగిల్ ఇంప్రెసివ్ గానే ఉంది. సుమంత్ అశ్విన్ హీరోగా.. అనీషా ఆంబ్రోస్.. మానస హిమవర్ష.. మనాలి రాథోడ్ హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ సినిమాను.. మే 3వ వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.


Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News