కొలతలు కొలిచేది ఎప్పుడంటే..

Update: 2017-05-05 16:40 GMT
చాలాకాలం నుండి పసలపూడి వంశీ హిట్టు కోసం సతమతమవుతున్నాడు. అందుకే ఇప్పుడు తన హిట్టు సినిమా అయిన ''లేడీస్ టైలర్'' కు తనే ఒక సీక్వెల్ తో వస్తున్నాడు. అదే ''ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్'' సినిమా. సుమంత్ అశ్విన్ హీరోగా.. అనీషా ఆంబ్రోస్.. మనాలి రాథోడ్ హీరోయిన్లుగా వస్తున్న ఈ సినిమాను ఫైనల్ గా ఎప్పుడు దించేది చెప్పేశారు.

జూన్ 2న ''ఫ్యాషన్ డిజైనర్'' ధియేటర్లకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ బాహుబలి ప్రభంజనం ఎక్కువగా ఉండటంతో.. మే నెలలో వచ్చేద్దాం అనుకున్న ఈ సినిమాను ఓ రెండు వారాల లేటుగా తీసుకొద్దాం అనుకున్నారట. కాకపోతే ఇప్పటికే బాక్సీఫీస్ ను షేక్ చేయడానికి ఇతర సినిమాలు చాలామటుకు ఒకేసారి మే చివరాకర్లో దాడి చేస్తుండటంతో.. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ వారు రూటు మార్చి జూన్ మొదటి వారానికి చెక్కేశారు. ఇప్పటికే మణిశర్మ అందించిన బాణీలు టివిల్లో రేడియోల్లో బాగానే మోగుతుండటంతో.. సినిమా ఓపెనింగ్స్ పై ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

మరి జూన్ 2 నుండి ఈ లేడీస్ టైలర్ కొడుకు సినిమాలో అమ్మాయిల కొలతలు కొలుస్తూ.. బయట బాక్సాఫీస్ కొలతలు కొలవాలంటే.. భారీగా ప్రమోషన్లు చేయాల్సిందే. హైప్ లేకుండా ఈరోజుల్లో ఓపెనింగులు సాధ్యపడట్లేదు. అసలే వంశీ గురించి కొత్తతరానికి పెద్దగా తెలియదు కాబట్టి.. కాస్త ఊపు తెప్పిస్తేనే కొలతల పని ఈజీ అవుతుంది. చూద్దాం ఏం చేస్తారో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News