ప్రముఖ నిర్మాత కొడుకు పూరి వద్ద..!

Update: 2022-08-17 02:30 GMT
శరత్‌ మరార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గతంలో పవన్ కు అత్యంత ఆప్తుడిగా ఆయనకు పేరు ఉంది. పవన్ ప్రోత్సహంతో నిర్మాతగా మారిన శరత్ మరార్ ఆ తర్వాత కొన్ని కారణా వల్ల పవన్‌ నుండి దూరం అయ్యాడు.

పవన్‌ నుండి దూరం అయిన తర్వాత నిర్మాణంను తగ్గించాడు. ఆ మధ్య కొన్ని డబ్బింగ్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.

మళ్లీ నిర్మాతగా మెల్ల మెల్లగా అడుగులు వేస్తున్నాడు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇక నుండి వరుసగా సినిమాలు చేయాలని శరత్‌ మరార్‌ భావిస్తున్నారు. ఆయన విషయం పక్కన పెడితే ఆయన కొడుకు ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. శరత్ మరార్ తనయుడు అదిత్‌ మరార్ ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు పూరి వద్ద చేస్తున్నాడట.

విదేశాల్లో చదువు పూర్తి చేసిన అదిత్‌ మరార్‌ చూడ్డానికి హీరోలా ఉంటాడు. అందుకే చాలా మంది అదిత్‌ ను హీరోగా పరిచయం చేయమని శరత్‌ మరార్‌ కి సూచించారట. కాని అదిత్‌ మాత్రం తనకు డైరెక్షన్‌ పై ఆసక్తి అంటూ పూరి వద్ద తనను అసిస్టెంట్ గా జాయిన్ అయ్యేందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వమంటూ తండ్రిని అడిగాడట.. అందుకు శరత్ మరార్ కూడా ఓకే చెప్పాడట.

గతంలో నాగ శౌర్య హీరోగా నటించిన లక్ష్య సినిమా కు లైన్ ప్రొడ్యూసర్ గా అదిత్ వర్క్ చేశాడు. ఇప్పుడు పూరి వద్ద జనగనమణ సినిమా కు గాను అసిస్టెంట్‌ డైరెక్టర్ గా చేసేందుకు ఎంపిక అయ్యాడట.

పూరి వద్ద అసిస్టెంట్ గా జాయిన్ అవ్వడం అంత సులభమైన విషయం కాదు. ఆయన కు చాలా నమ్మకం కలిగితే తప్ప అవకాశం ఇవ్వడు అంటారు. అదిత్ వర్క్ స్టైల్‌ చూసి తన వద్ద అవకాశం ఇచ్చినట్లుగా పూరి అన్నాడట.
Tags:    

Similar News