ఫోటో స్టొరీ: చిట్టిపొట్టి గౌన్లో తెలుగు భామ హంగామా

Update: 2019-08-20 14:34 GMT
పేరుకు 'తెలుగు చలన చిత్ర పరిశ్రమ' అయినా హీరోయిన్లు మాత్రం ఇతర భాషల వారే ఎక్కువ. అందుకేనేమో ఎక్కువ మంది జనాలు టాలీవుడ్ అని పిలవడం మొదలు పెట్టారు.  హిందీనో.. ఇంగ్లిపీసో దంచికొట్టకుండా అచ్చతెలుగులో మాట్లాడితే ఎవరికైనా లోకువే మరి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈషా రెబ్బా లాంటి భామ టాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం సాధారణమైన విషయం కాదు.   సినిమాల్లో హీరోయిన్ గా తన సత్తా చాటడమే కాదు.  ఈషా రెబ్బా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే సంగతి తెలిసిందే.

రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ.. గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజనులతో నిత్యం టచ్ లో ఉంటుంది. ఒక్కోసారి ట్రెడిషనల్ గా చీరలోనూ మరోసారి  మోడరన్ గా వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ లోనూ తళుక్కున మెరిసే ఈ భామ ఈసారి మరో రకమైన డ్రెస్ లో ఫోటో షూట్ చేసింది.  ఫుల్ స్లీవ్స్.. బటన్స్ ఉండే గ్రీన్ కలర్ గౌన్ లో సూపర్ పోజులు ఇచ్చింది.  ఈ ఫోటోకు "ఇంకా ఇంకా కోరుకోవడం మానవద్దు" అంటూ పరోక్షంగా అబ్దుల్ కలామ్ గారి 'కలలు కనండి' అనే సందేశాన్ని ఇచ్చింది.   ఇక ఈ ఫోటో షూట్ కోసం ఈషా ధరించిన గౌన్ చిట్టిగా పొట్టిగా ఉండడంతో కాళ్ళ అందాలు బయటపడ్డాయి.  పెద్దగా గ్లామర్ షో చేయకపోయినా ఫోటోలు మాత్రం అదిరిపోయాయి.  

ఈ  ఫోటోలకు నెటిజన్ల నుండి మంచి స్పందన వచ్చింది.  "మేము లైక్స్ కొట్టడం ఆపం కదా".. "తుమ్ వరంగల్ కీ షాన్ హో".. "న్యాచురల్ తెలుగు బ్యూటీ".."దే.. వుడా కళ్ళు తిప్పుకోనివ్వడం లేదుగా" అంటూ రెచ్చిపోయారు. ఇక ఈషా ఫ్యూచర్ ప్రాజెక్టుల సంగతి మాట్లాడుకుంటే శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో 'రాగల 24 గంటల్లో' అనే చిత్రంలో నటిస్తోంది.  ఈ సినిమాతో పాటుగా ఒక తమిళ మూవీలోనూ.. మరో కన్నడ సినిమాలోనూ నటిస్తోంది.
Tags:    

Similar News