మాజీ ప్రియుడి కోసం పూజ‌లు.. ప్రార్థ‌న‌లు

Update: 2015-11-27 15:30 GMT
బాలీవుడ్ ఒక‌ప్పుటి ప్రేమ జంట‌.. ఇప్పుడు స్నేహితులుగా మారిన జంట‌.. ర‌ణ‌బీర్ క‌పూర్‌- దీపికా ప‌డుకొనే. ఈ జంట ప్ర‌స్తుతం త‌మాషా చిత్రంలో న‌టించింది. ఈ సినిమా శుక్ర‌వారం దేశ‌వ్యాప్తంగా గ్రాండ్‌ గా రిలీజ్ అయ్యింది. త‌మ‌షాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే త‌న మాజీ ల‌వ‌ర్‌ తో తాను క‌లిసి న‌టించిన ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించాలని కోరుకుంటూ.. ఈసొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి ముంబైలోని సిద్ధి వినాయ‌కుడిని ద‌ర్శించుకుంది. తల్లి ఉజాలాతో కలిసి వచ్చిన దీపిక వినాయ‌కుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించింది. హీరోయిన్ అలా  దొరికితే.. మీడియా వాళ్లు ఊరుకుంటారా? చ‌క చ‌కా ఆమెపై ప్ర‌శ్న‌లు కురిపించేశారు. మీడియా వాళ్లు అడిగిన ప్ర‌శ్న‌కు దీపికా చెప్పిన స‌మాధానం హాట్ టాపిక్‌ గా మారింది.  

తన ప్రతి సినిమా విడుదలకు ముందు  ఈ గుడికి రావడం ఆనవాయితీ అని  దీపికా చెబుతోంది.  అందులో భాగంగానే `తమాషా` సినిమా  కూడా  విజయం సాధించాలని  గణనాథుడ్ని ప్రార్థించాన‌ని చెప్పుకొచ్చింది. అంతేగాక మరో ఆసక్తికర విషయాన్ని కూడా మీడియాకు తెలిపింది. ` మీ  ఫ్రెండ్ రణబీర్  కోసం కూడా  ప్రార్థించారా` అని అడిగినపుడు... 'అవును... రణబీర్ చాలా టాలెంటెడ్ యాక్టర్... జీవితంలో గెలుపు ఓటములు ఎవరికైనా రావడం సహజం.. అలాగే రణబీర్ కు కూడా..  ఈ సినిమా తప్పకుండా హిట్  అవుతుంది. మూవీలో అతని నటన అద్భుతంగా ఉంది' అని కితాబిచ్చింది. దీంతో దీపిక తన మాజీ ప్రియుడి కోసం  పూజలు చేసిందనే వార్త బాలీవుడ్‌ లో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఈ సినిమాతో రణబీర్ కపూర్ తో మూడోసారి జతకట్టిందీ ఈ సుంద‌రి. లవర్ బోయ్  ఇమేజ్ సొంతం చేసుకున్న రణబీర్ కపూర్, దీపికా పడుకొనే  జంటగా ఇంతియాజ్ అలీ  డైరెక్ష‌న్‌లో త‌మాషా తెర‌కెక్కింది.  సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమాను నిర్మించారు. `యే జవానీ హై దీవానీ సినిమాలాగానే  తమాషా మూవీ కూడా బంపర్ హిట్ కావాలని  కోరుకుంటోందీ ఈ జంట. వీరిద్ద‌రూ మ‌రోసారి జతకట్టడంతో పాటు దీపిక ర‌ణ‌బీర్ గురించి చాలా పాజిటివ్‌గా మీడియా వ‌ద్దే రియాక్ట్ అవ‌డంతో ఈ మాజీ లవర్స్ కలవబోతున్నారంటూ బాలీవుడ్ గుసగుసలాడుకుంటోంది. త‌మాషా మూవీలో ఈ జంట ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ  ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ నేపథ్యంలో  తాజాగా దీపిక  వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఆ వినాయ‌కుడి ద‌య‌వ‌ల్ల.. మాజీ ప్రియురాలి ప్రార్థ‌న వ‌ల్ల అయినా ర‌ణ‌బీర్ హిట్ కొడ‌తాడేమో చూద్దాం.
Tags:    

Similar News