జూనియ‌ర్ ఉద‌య‌భాను తొండి

Update: 2015-09-07 15:57 GMT
ఏమా ఒంపుల ప్రదర్శన.. ఏమేమి  ఆ నాభి ప్ర‌ద‌ర్శ‌న‌... ఎవరికోసం ఆ ప‌డిగాపులు..  చూపుల్లో రెబ‌లిజం, నిలుచున్న తీరులో రెబ‌లిజం.. యాటిట్యూడ్‌ లో జాన‌త‌నం..   ఏ కోణంలో చూసినా అంతుచిక్క‌ని మ‌ద‌నం.. బాప్‌ రే .. ఓ తెలుగు హీరోయిన్‌ కు ఈ రేంజు హొయ‌లు త‌గునా?  ముంబై మోడ‌ల్స్‌ కి, ప్యారిస్ ర్యాంప్ వాక్‌ కి ఆల్ట‌ర్నేట్ ఈవిడొక్క‌రే అనుకోవాలా... అస‌లింత‌కీ ఎవ‌రీ భామ‌?

ఎస్‌. .. అంద‌రికీ తెలిసిన ఈ భామామ‌ణి పేరు ధీక్షా పంథ్. హైద‌రాబాద్ స్వ‌స్థ‌లం. ఆరంభం మోడ‌ల్‌ గా కెరీర్ ప్రారంభించింది. ఫ్యాష‌న్ ర్యాంపు పై త‌ళుకుళీనింది. కాల‌క్ర‌మేణా న‌టిగా త‌న‌ని తాను ప్ర‌మోట్ చేసుకోవ‌డం మొద‌లెట్టింది. అలా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించి వ‌రుస‌గా చిన్నా చిత‌కా సినిమాల్లో ఛాన్సులు అందుకుంది.  ఆరంభం అర‌కొర పారితోషికాలే అయినా.. అవ‌కాశం వ‌స్తే వ‌దులుకోలేదు. ఏకంగా ఓ సినిమాలో యాంకర్‌ ఉదయభానుకు డూప్‌ గా కూడా నటించింది. అలా అలా చివ‌రికి ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ క‌ళ్ల‌లో ప‌డింది. గోపాల గోపాల సినిమాలో ఓ వెరైటీ రోల్‌ లో న‌టించే ఛాన్సందుకుంది. ఆ సినిమాలో మాయా మ‌శ్చీంద్ర అనిపించే స‌న్యాసిని పాత్ర‌లో క‌నిపించింది. కాషాయం ధ‌రించిన క‌ర్కోఠ‌కురాలిగా క‌నిపించి అంద‌రికీ షాకిచ్చింది.

ప్ర‌స్తుతం తొండి అనే సినిమాలో న‌టిస్తోంది. ఇప్ప‌టికిప్పుడు ఈ అమ్మ‌డి ఖాతాలో చాలా అవ‌కాశాలే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ద‌శ తిరిగిపోతోంది. కాస్త ఈ అమ్మ‌డి యాటిట్యూడ్ ప్ర‌కారం ఉద‌య‌భాను పోలిక‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఈజ్‌ లో, అప్పియ‌రెన్స్‌ లో భాను అంత చెలాకీగా ఉంటుంది ఈ అమ్మ‌డు. పైగా ఈ రేంజులో హొయలు వలకబోస్తుంటే ఇక ఫిలిం మేకర్ లు క్యూలు కట్టేస్తారేమో..
Tags:    

Similar News