దేక్ దేక్ అంటూనే దేకించేసిన డాన్ పోలీస్

Update: 2022-02-12 07:40 GMT
శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఓవైపు సినిమాలు చేస్తూనే అప్పుడ‌ప్పుడు మ్యూజిక్  వీడియోస్ తోనూ  ఆక‌ట్టుకుంటుంది. `జీఎఫ్..బీఎఫ్‌`.. `మేరా అగ్ని మేనీ`..`జెండా పూల్`.. `పానీ పానీ` వంటి పాప్ వీడియోల‌తో బ్యూటీ ఎంతో ఫేమ‌స్.  న‌టిగా క‌న్నా మ్యూజిక్ వీడియోల‌తోనే ఎక్కువ‌గా ఫోక‌స్ అయింది. పాప్ వీడియో సాంగ్స్  లో  అందాలు ఆర‌బోస్తూ జాకీ వేసిన స్టెప్పుల‌కు ఎవ‌రైనా మంత్ర‌ముగ్దులు  అవ్వాల్సిందే.

తాజాగా  జాకీ `మ‌డ్ మ‌డ్ కే` టైటిల్ తో తెర‌కెక్కిన  మ‌రో మ్యూజిక్ వీడియోలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ వీడియో రిలీజ్ అయింది. `మ‌డ్ మ‌డ్ కే దేక్ తానా` అంటూ సాగే ప‌బ్ సాంగ్ లో జాక్వెలిన్ ప‌నిత‌నం ప్ర‌శంస‌నీయం.

అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్స్  బిజినెస్ డీల్స్ మ‌ధ్య  జాకీ స్టెప్పులు.. పాట‌లో గ్లామ్ షో  హైలైట్ గా నిలిచాయి. కార్ ఛేజ్ లు ..గ‌న్ ఫైర్లు..క్లైమాక్స్ లో ఇంట‌ర్ పోల్ ఎంట్రీ స‌న్నివేశాలతో పాట ముగుస్తుంది. ప‌బ్ బ్యాక్ డ్రాప్  లో చిత్రీక‌రించిన సాంగ్స్ ఫెయిలైంది రేర్.  

మ‌డ్ మ‌డ్ కే` కూడా ఆకోవ‌కే చెందుతుంది. హాట్ భామ జాకీ కాప్ ముసుగులో అందాల ఎర‌తో క‌ళ్ల‌కు  గంత‌లు క‌ట్టించి క‌న్నింగ్ గాళ్ ఫ్రెండ్  గా అభిన‌యించింది. దేక్ దేక్ అంటూనే బోయ్  ఫ్రెండ్ ని పోలీసుకుల‌కు ప‌ట్టించింది . ఈ పాట‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పాట‌ని రిలీజ్ చేసారు. ప్ర‌స్తుతం పాట నెట్టింట వైర‌ల్ గా మారింది. నేహా క‌క్క‌ర్..టోనీ క‌క్క‌ర్ అద్భుతంగా ఆల‌పించారు.

పాప్ సాంగ్ లో మ‌రోసారి కక్క‌ర్ బ్రాండ్ క‌నిపించింది. ఈ పాట‌లో  మిచెల్ మారోన్.. జాక్వెలీన్ పెర్నాండేజ్.. టోనీ క‌క్క‌ర్ న‌టించారు. దుబాయ్ కి చెందిన మెట్రో టాకీస్.. థ‌ర్డ్ ఐ ఫిల్మ్స్ ఈ వీడియోని  నిర్మించాయి. ఇక జాక్వెలిన్ సినిమా కెరీర్ సంతోషంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే.  ఇటీవ‌లే `బ‌చ్చ‌న్ పాండే`  షూటింగ్ పూర్తిచేసింది. జాకీ న‌టిస్తోన్న ఇత‌ర చిత్రాలు `స‌ర్క‌స్`..`రామ‌సేతు`  ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఇవి రెండు భారీ బ‌డ్జెట్ చిత్రాలు. అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి.










Tags:    

Similar News