స్టేజ్ పైనే తుదిశ్వాస విడిచిన నటి!

Update: 2016-10-24 07:14 GMT
కళ్లుమూసుకుని కనేది కల.. కళ్లతో అభినయించేది కళ. నిద్రపోతూ కనేది కల... నిద్రపోతోన్న జాతిని మేలుకొలిపేది కళ... ఆ కళ కోసం జీవితాలను పణంగా పెట్టేవారు కొందరైతే... ఆ కళే జీవితంగా బ్రతికేది ఇంకొందరు. ఈ క్రమంలో కళే శ్వాసగా బతికే వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే తాజాగా జరిగిన ఒక సంఘటన అందరిచేతా కంటనీరు పెట్టించింది. ఒక నటి కళా ప్రదర్శన చేస్తూనే తుదిశ్వాస విడిచిన ఘటన పూణేలో విషాదాన్ని నింపింది.

పూణేలోని భరతనాట్యమందిర్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న ప్రముఖ క్లాసికల్ డాన్సర్ - మరాఠీ నటి అశ్విని ఎఖోటే సడెన్ గా హార్ట్ ఎటాక్ రావడంతో స్టేజ్ మీదే కుప్పకూలిపోయారు. దాంతో కంగారు పడిన అక్కడివారంతా ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ దురదృష్టవసాత్తు ఆమె అప్పటికే కళతోనే - కళలోనే తుదిశ్వాస విడిచారు.

ఇటు సంప్రదాయ నృత్యంలోనూ - అటు మరాఠీ సినిమాల్లోనూ ఈ 44 ఏళ్ల అశ్విని ఎఖోటే టాలెంటెడ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్నారు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ పాత్రలో ఒదిగిపోయి నటిస్తారని, చాలా హార్డ్ వర్కరని తోటి నటీనటులు చెబుతున్నారు. ఈస్థాయి నటి అశ్వినీ మరణ వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. మరాఠీ చిత్రపరిశ్రమ అశ్వినికి ఘననివాళులు అర్పించగా, అశ్విని లేని లోటు ఎవరూ తీర్చలేరని ఆమె అభిమానులు - సినీ ప్రేమికులు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News