రాజకీయాలకు నో చెప్పిన క్రేజీ విలన్ కం రియల్ హీరో
2020 మహమ్మారీ క్రైసిస్ ఎన్నో పాఠాల్ని నేర్పించింది. ఇక మనిషిలోని మానవత్వాన్ని కూడా మేల్కొలిపింది. వెండితెరపై విలన్ గా కనిపించే వారిని కూడా హీరోల్ని చేసింది కోవిడ్. నిజమైన హీరోలు ఎవరో కూడా బయటి ప్రపంచానికి ఆవిష్కరించింది. అలా బయటపడిన వాడే సోనూసూద్. మహమ్మారీ కష్టకాలంలో కూలీలు కార్మికుల్ని తమ ఇండ్లకు తరలించేందుకు భారీగా వాహనాల్ని బస్సుల్ని ఏర్పాటు చేసి రియల్ హీరో అయ్యాడు. దిగ్గజాల్లాంటి స్టార్లు చేయలేని పని చేసి శహభాష్ అనిపించాడు.
అమాంతం ప్రజల్లో అతడి ఇమేజ్ పెరిగింది. సోను సూద్ కోవిడ్ కష్టకాలంలో చేసిన ఆదర్శప్రాయమైన పనితో ప్రజలలో సూపర్ హీరోగా మారడంతో ఆయన ఎప్పుడైనా రాజకీయాల్లో చేరతారని చాలామంది భావించారు. ఇది నిజమేనా? అని ప్రశ్నిస్తే.. సోనూసూద్ ఇచ్చిన షాకింగ్ ఆన్సర్ తెలుసుకోవాల్సిందే.
దీనిపై స్పందిస్తూ.. ఇటీవల ఒక హిందీ వెబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల్లోకి ప్రవేశించడానికి వివిధ రాజకీయ పార్టీల నుండి బహిరంగ ఆఫర్ లను పొందుతున్నానని అయితే వాటిని మర్యాదగా తిరస్కరిస్తున్నానని సోను సమాధానం ఇచ్చారు.
తన సినీ జీవితం చాలా సానుకూలంగా ఉన్నందున ప్రస్తుతం దానిని వదిలి రాజకీయాల్లోకి ప్రవేశించే మానసిక స్థితిలో లేనని సోను అన్నారు. వృత్తిగతంగా వరుస సినిమాలతో బిజీ. మెగాస్టార్ చిరంజీవి తో `ఆచార్య` .. బెల్లంకొండ శ్రీనివాస్ `అల్లుడు అదుర్స్` తదితర చిత్రాలలో బిజీగా ఉన్నారు సోనూసూద్. అటు బాలీవుడ్ లోనూ వరుస ఆఫర్లు ఉండగా.. పలు బయోపిక్ చిత్రాల్ని నిర్మిస్తున్నారు.