ప్రణీతకూ తప్పని పోటీ

Update: 2015-07-03 04:24 GMT
స్టార్ హీరోల సినిమాలకు స్టార్ కథానాయికలైన అనుష్క, కాజల్, సమంత వంటి వారు పోటీ పడడం మామూలే. వరుసగా పెద్ద హీరోల సినిమాలు చేస్తూ రీసెంట్ గా ఈ లిస్టు లోకి రకుల్ ప్రీత్ కూడా చేరిపోయింది. ఇక కుర్ర హీరోలకి రెజీనా, రాశిఖన్న, ఆదా శర్మ లాంటి వారు వుండనే వున్నారు. ఇక ఇప్పుడు సెకెండ్ హీరోయిన్ల మధ్యా పోటీ రాజుకోబోతుంది.

స్టార్ కతానాయికలకి ఏమాత్రం తీసిపోని అందం, అభినయం వున్నా సెకెండ్ హీరోయిన్ గానే పేరు తెచ్చుకుంది ప్రణీత. అగ్ర హీరోలు పవన్ కళ్యాణ్ నుండి మహేష్ బాబు వరకు సెకెండ్ హీరోయిన్ అంటే టక్కున వెలిగేది ఈ అమ్మడి పేరే. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రణీతకు పోటీ తప్పేట్టు లేదు. లెజెండ్ సినిమాతో సెకెండ్ హీరోయిన్ గా చెరగని ముద్ర వేసిన సోనాల్ చౌహన్, రామ్ తో నటించిన పండగ చేస్కో సినిమాలోనూ సెకెండ్ హీరోయిన్ గానే నటించింది. తాజాగా బాలయ్య డిక్టేటర్ లో అంజలి మొదటి హీరోయిన్ కాగా సోనాల్ సెకెండ్ లీడ్. చూస్తుంటే... ప్రణీత సెకెండ్ హీరోయిన్ ప్లేస్ కి ఎసరుపెట్టేలా వుంది సోనాల్.        
Tags:    

Similar News