గెట్ రెడీ.. ఆగస్టు 22న వస్తున్నాడు..

Update: 2017-08-16 12:27 GMT
చెప్పాపెట్టకుండా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా తాలూకు పూజా కార్యక్రమాలు నిర్విహంచడం అందరికీ షాకిచ్చేసిందనే సంగతి తెలిసిందే. ఈ సమయంలో అందరూ కూడా రామ్ చరణ్‌ సెంటిమెంట్ వైపే మొగ్గాడని అనుకున్నారు. ఇందులో సీక్రెట్ చేయాల్సిన విషయం ఏమీ లేదు కాని.. ఖైదీ నెం 150 విషయంలో ఇదే తరహాలో వారి పాత ఆఫీసులో పూజ చేసి సినిమాను మొదలెట్టి.. ఏకంగా 100 కోట్లు షేర్ పట్టేశారు. అందుకే ఆ సెంటిమెంట్ కు లోబడి ఇప్పుడు కూడా అలాగే పూజ చేశారట.

అయితే ఈ సినిమా తాలూకు టైటిల్ మోషన్ మోస్టర్ ను ఇప్పుడు త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. సినిమా పేరును ప్రకటిస్తూ.. టైటిల్ ఏంటో యానిమేషన్లో చూపిస్తూ.. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కొణిదెల ప్రొడక్షన్స్ వారు ఆ మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తారట. ఆ విషయాన్ని ఈరోజు రామ్ చరణ్‌ స్వయంగా ప్రకటించేశాడు. మొత్తానికి సురేందర్ రెడ్డి డైరక్షన్లో ఎప్పుడెప్పుడు మొదలవుతుందో అనుకుంటున్న చిరంజీవి 151వ సినిమా.. తన రీఎంట్రీ మూవీ రిలీజైన ఎనిమిది నెలలకు ఇప్పుడు మొదలైంది. సో ఇక లేటయ్యే ఛాన్సులేదటలే.

ఇకపోతే ఈ మోషన్ పోస్టర్ తాలూకు యానిమేషన్ అద్భుతంగా వస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ''మహావీర'' అంటూ కూడా రూమర్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి గెటప్ కూడా ఈ టైటిల్ యానిమేషన్ కమ్ పోస్టర్ లో పాక్షికంగా కనిపిస్తుందట. అది సంగతి.
Tags:    

Similar News