దటీజ్ మెగాస్టార్.. ఈ వీడియో చూడండి

Update: 2015-07-28 16:18 GMT

Full View
చిరంజీవి రాజకీయాల్లో ఎలాంటి పేరైనా తెచ్చుకుని ఉండొచ్చు. కానీ సినిమాల దగ్గరికి వచ్చేసరికి ఆయన మెగాస్టారే. ఒక స్టార్ హీరోకు ఎలాంటి లక్షణాలుండాలో చిరంజీవిని చూపిస్తే సరిపోతుంది. నటనకు నటన.. డ్యాన్సుకు డ్యాన్సు.. ఫైట్లకు ఫైట్లు.. ఎందులో అయినా సరే చిరంజీవికి చిరంజీవే సాటి. అందుకే ఆయన మెగా స్టార్ అయ్యారు. ఎలాంటి పాత్రలోకై నా అలవోకగా పరకాయ ప్రవేశం చేసే మెగాస్టార్.. కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు వేశారు. అలాంటి ప్రత్యేకమైన పాత్రల్లో ఇంద్రసేనారెడ్డి క్యారెక్టర్ ఒకటి. ఫ్యాక్షన్ పాత్రలకు చిరు సూటవ్వరేమో అని సందేహాలున్న వారందరికీ ఆ సినిమాతో సమాధానం చెప్పాడు మెగాస్టార్.

ఇంద్ర పాత్రలో చిరు ఎలా చెలరేగిపోయారో తెరమీద అందరం చూశాం. ఐతే కెమెరా ముందు చిరు ఎలా నటించాడో.. ఎలా డైలాగులు పలికాడో మనకు తెలియదు. ఐతే ఈ మధ్య చరణ్ ఫ్యాన్స్ ఇంద్ర సినిమాకు సంబంధించి డబ్బింగ్ కు ముందు వీడియో ఒకటి అప్ లోడ్ చేశారు. బ్యాగ్రౌండ్ స్కోర్, డబ్బింగ్ యాడ్ అవని వీడియో అది. ఆన్ ద సెట్స్ ఎవరు ఎలా డైలాగులు చెప్పారో ఈ వీడియో చూస్తే తెలిసిపోతోంది. వారణాసి నుంచి వచ్చాక విలన్ ఇంట్లోకి ఇంద్ర రీఎంట్రీ ఇచ్చే సన్నివేశమది. అందులో చిరు ఎంత పర్ఫెక్ట్ గా డైలాగులు చెప్పారంటే.. మళ్లీ డబ్బింగ్ అవసరమే లేదని చెప్పాలి. ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే, ముఖేష్ రుషి సహా మిగతా వాళ్లందరూ నోటికొచ్చినట్లు ఇష్టానుసారం డైలాగులు చెప్పారు. ఈ వీడియో చూస్తే చిరంజీవి ప్రత్యేకతో ఏంటో అందరికీ అర్థమవుతుంది.
Tags:    

Similar News