బర్త్ డే స్పెషల్: తెలుగు సినిమా చరిత్ర ఒక మేలిమి పేజీని పోగొట్టుకునేది
150 పైగా చిత్రాలతో అజేయంగా కెరీర్ ని సాగిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. 66 వయసులో యువతరంతో పోటీపడుతూ బిగ్ ఛాలెంజర్ గా మారారు. ఒక మారు స్వగతంలోకి వెళితే.. కొణిదెల వెంకట్రావు- శ్రీమతి అంజనా దేవి దంపతులకు 1955 ఆగస్టు 22న తొలి సంతానం గా జన్మించారు చిరంజీవి. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివశంకర్ ప్రసాద్ ..1975లో కళాశాలలో చదువుతున్నప్పుడు రాజీనామా అనే నాటకంలో ప్రతినాయకుడి పాత్రను పోషించారు. ఆ పాత్ర పోషణకు ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకున్నారు.
అంతకముందు పదో తరగతి చదివేప్పుడు స్కూల్ వార్సికోత్సవం సందర్భంగా నాటకం వేస్తే అందులో ఉత్తమ నటుడిగా అవార్డ్ వచ్చింది. అవి ఆయన అభినయ సామర్థ్యానికి మెచ్చుతునకలు. ఇవి రెండూ చిరంజీవిని ఆలోచింపజేసాయి. డిగ్రీ చదివేప్పుడు ఎన్.సి.సి తరపున పాల్గొని డిల్లీ వెళ్లారు. నాటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ సమక్షంలో పోతురాజు పోలేరమ్మ ప్రదర్శన ఇవ్వడం ఆయన విద్యార్థి జీవితంలో మర్చిపోలేనిది. 1977 లో డిగ్రీ పట్టా పొందిన తర్వాత తండ్రి అనుమతి మేరకు ఐసీడబ్లూఏ కోర్సులో చేరతానని చెప్పి చెన్నై చేరిన కొణిదెల శివశంకర వరప్రసాద్ అడయార్ వర్శిటీలో చేరారు.
1978 మేలో ఫిలింఇనిస్టిట్యూట్ లో నటశిక్షణ పూర్తయింది. ఆనాడు సినిమాల్లో చేరాలన్న ఆలోచన ఆయనకు రాకపోయినా.. అందుకు ఆయన తండ్రి కొణిదెల వెంకట్రావుగారు అంగీకరించకపోయినా తెలుగు సినిమా చరిత్ర ఒక మేలిమి పేజీని పోగొట్టుకునేది అనేది నిస్సందేహం నిర్వివాదాంశం.