సొంత ప్రయత్నాల్లో అనేకమంది రైటర్లు

Update: 2015-09-02 17:30 GMT
మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా అనేది ఆల్‌ టైమ్‌ హాట్‌ టాపిక్‌. అయితే ఈ సినిమా కథ ఇంతవరకూ ఫైనల్‌ కాలేదు. పూరీ చెప్పిన కథలో ద్వితీయార్థం నచ్చలేదని చిరు అప్పట్లో ఓపెన్‌ గానే ప్రకటించారు. మరో రెండు నెలల్లో సినిమా ప్రారంభించి ఎట్టి పరిస్థితుల్లో 2016 వేసవి నాటికి రిలీజ్‌ చేయాలన్నది మాష్టర్‌ ప్లాన్‌. అయితే ఆ డెడ్‌ లైన్‌ మేరకు మన దర్శకరచయితలు విశ్వ ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం.

ఇప్పటికే ఓ నలుగురు రచయితలు కథలు పట్టుకుని వెళ్లి మెగాస్టార్‌ కి వినిపించారు. లైన్‌ నచ్చింది. కానీ కథను పూర్తిగా డెవలప్‌ చేసి వినిపించండి అని చిరు చెప్పి పంపించారు. అంతేకాదు ఇప్పటికే స్టార్‌ రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ బాహుబలి, భజరంగి భాయిజాన్‌ చిత్రాలకు కథ అందించి సక్సెస్‌ ఫుల్‌ రైటర్‌ గా వెలిగిపోతున్నారు. అలాంటి రచయిత ఓ కథ ఇస్తే కాదంటానా? అంటూ చిరునే స్వయంగా నోరు విప్పి అడిగారు.

కాబట్టి విజయేంద్రుని కథ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక పూరి జగన్నాథ్‌ లోఫర్‌ సినిమా పూర్తి చేస్తూనే, చిరు కథని కూడా వదిలిపెట్టకుండా పూర్తి చేసే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. కాబట్టి ఇప్పటికైతే ఆరుగురు చిరు వెంట లైన్‌ లో ఉన్నట్టే. ఎవరికి వారే యమునా తీరే.. ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నారు. మరి ఎవరి కథ అంతిమంగా ఫైనల్‌ అవుతుందో వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News