చిన్మయి.. తెలుగు సినిమా ఫాలోవర్లకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. డబ్బింగ ఆర్టిస్టుగా.. గాయనిగా.. సోషల్ యాక్టివిస్టుగా.. సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్ గా ఉండే సెలబ్రెటీగా చిన్మయి గురించి అందరికీ బాగానే తెలుసు. ‘అందాల రాక్షసి’తో కథానాయకుడిగా పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్ ను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడిన చిన్మయి.. తన బహుముఖ ప్రతిభను చాటుకుంటూ సాగిపోతోంది. తన భర్త దర్శకుడిగా పరిచయం కాబోతున్న ‘చి ల సౌ’ విషయంలో ఆమె చాలా ఉద్వేగతంతో కనిపిస్తోంది. ఈ సినిమా కథ తన మనసుకు చాలా దగ్గరైందని.. తన వ్యక్తిగత జీవితంలోని విషయాలు కూడా ఇందులో కనిపిస్తాయని.. దాదాపుగా ప్రతి అమ్మాయి.. అబ్బాయి ఈ సినిమాతో కనెక్టవుతారని ఆమె చెప్పింది.
అరేంజ్డ్ మ్యారేజ్ సిస్టమ్ విషయంలో తనకు చాలా అభ్యంతరాలున్నాయన్న చిన్మయి.. పెళ్లి చూపుల ప్రాసెస్ అంతా పశువుల అమ్మకం లాగా ఉంటుందని అంది. అమ్మాయి.. అబ్బాయి ఒకరికొకరు నచ్చినా కూడా పెద్దలు మాత్రం ఫార్మాలిటీస్ మాట్లాడదాం అంటారని.. దానికే ప్రయారిటీ ఇస్తారని.. ఒక అమ్మాయిని కోడలిగా తెచ్చుకుంటే ఆమెతో పాటు ఏమేం వస్తాయి.. ఆమెకు ఎంత ఆస్తి ఉంది.. ఇవన్నీ ఆరా తీస్తారని.. అదే సమయంలో అబ్బాయిలకు కూడా ఇబ్బంది ఉందని.. వాళ్ల శాలరీని చూసే అమ్మాయిని ఇవ్వడం జరుగుతోందని చిన్మయి చెప్పింది. తన వ్యక్తిగత జీవితంలో కూడా పెళ్లి చూపుల ప్రాసెస్ కొంచెం నడిచిందని.. అప్పుడు తాను ఒక పాటకు ఎంత తీసుకుంటాను.. ఇప్పటిదాకా ఎంత సంపాదించాను.. ఆస్తులేమైనా కూడబెట్టానా అని ఆరా తీశారని.. తనకు ఇదంతా చాలా ఇబ్బందిగా అనిపించిందని.. తాను జీవితంలో పెళ్లే చేసుకోకూడదని కూడా ఫిక్సయ్యానని.. కానీ పాపం రాహుల్ తగలడంతో పెళ్లి చేసుకోక తప్పలేదని నవ్వేసింది చిన్మయి.