పిల్లాడికి పాలిస్తూ ర్యాంప్ వాక్.. వైరల్..

Update: 2018-07-18 05:52 GMT
ఈ సృష్టిలో తల్లికి మాత్రమే దక్కిన గొప్ప అదృష్టం.. బిడ్డలకు పాలివ్వడం.. కానీ ఇప్పటికీ తల్లులు బహిరంగంగా   పాలివ్వడాన్ని ఇష్టపడరు.. ఇక కొంతమంది తమ అందచందాలు పోతాయని.. ఫిజిక్ పాడవుతుందని ఆ పనిచేయడానికి ముందుకు రారు. తల్లి పాలే బిడ్డకు శ్రేష్టం అని ఎంతమంది చెప్పినా కూడా కొందరు డబ్బా పాలతోనే పిల్లలను పెంచుతుంటారు. ఇలా ఎన్నో అపోహలు సమాజంలో గూడుకట్టుకొని ఉన్నాయి. వాటన్నింటిని తొలగించేందుకు తాజాగా ఓ మహిళా మోడల్ ముందుకొచ్చింది.

మోడలింగ్ రంగంలో కూడా చాలా మంది మహిళలు బిడ్డలకు పాలు ఇవ్వడానికి సందేహిస్తారు.. కానీ ఈ మోడల్ ఇదంతా సిగ్గుపడాల్సిన విషయం కాదని చాటింది. స్పోర్ట్స్  ఇల్లస్ట్రేటెడ్  స్విమ్ సూట్   మోడల్ మారా మార్టిన్ ఈ మేరకు చేసిన పని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

అమెరికాలోని మియామీలో నిర్వహించిన స్విమ్ సూట్ ఫ్యాషన్ షోలో మార్టిన్ బికినీ ధరించి తన ఐదు నెలల పాపకు పాలిస్తూ ర్యాంప్ మీద క్యాట్ వాక్ చేసింది. ఈ వీడియో - ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘మోడల్ మామ్’  హ్యాష్ ట్యాగ్ తో సంచలనమవుతున్నాయి.

CLICK HERE FOR VIDEO
Tags:    

Similar News