ఆ పాపకు కంటిన్యూగా ఆఫర్లు ఇస్తున్న డైరెక్టర్!

Update: 2019-12-14 07:52 GMT
కొంతమంది దర్శకులకు కొంతమంది నటీనటులతో.. టెక్నిషియన్స్ తో కంఫర్ట్ ఉంటుంది.  అందుకే వారిని తమ సినిమాల్లో రిపీట్ చేస్తుంటారు. మాస్ సినిమాల స్పెషలిస్టు బోయపాటి శ్రీను కూడా అందుకు మినహాయింపు కాదు. ఆయన హీరోయిన్ కేథరిన్ ట్రెసాకు ఈమధ్య తన సినిమాలలో అవకాశాలు వరసగా ఇస్తున్నాడు.

కేథరిన్ కు మొదటిసారిగా బోయపాటి 'సరైనోడు' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు.  పేరుకు సెకండ్ హీరోయిన్ అయిప్పటికీ ఎంఎల్ఎ పాత్రలో నటించిన కేథరిన్ కే ఎక్కువ పేరు వచ్చింది.  నిజానికి 'సరైనోడు' సినిమాకు అవకాశం ఇచ్చిన సమయంలో కేథరిన్ కు టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేవు. ఆ సమయంలో 'సరైనోడు' కేథరిన్ కు మంచి బూస్ట్ వచ్చింది. ఆ సినిమా తర్వాత బోయపాటి మరోసారి 'జయ జానకి నాయక' సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో అవకాశం ఇచ్చాడు. అంతటితో ఆగలేదు. తాజాగా మరో క్రేజీ ఆఫర్ ఇచ్చాడు.

బోయపాటి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో #NBK106 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈమధ్యే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది.  ఈ సినిమాలో హీరోయిన్ గా కేథరిన్ కు బోయపాటి అవకాశం ఇచ్చాడట.  నిజానికి కేథరిన్ కు తెలుగులో పెద్దగా ఆఫర్లే లేవు. విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' లో నలుగురు హీరోయిన్లలో ఒకరిగా నటిస్తోంది. ఇది తప్ప మరో ఆఫర్ లేదు.. ఈ సమయంలో హ్యాట్రిక్ ఫిలిం అయిన #NBK106 కు ఛాన్స్ రావడం కేథరిన్ కు జాక్ పాట్ అని చెప్పుకోవాలి. మరి ఈ సినిమాతో అయినా కేథరిన్ కు మంచి బ్రేక్ దక్కుతుందా లేదా అనేది వేచి చూడాలి.
Tags:    

Similar News