బైకులపై బాలీవుడ్ భామల బల్లేబల్లే

Update: 2015-07-26 08:09 GMT

హీరోయిన్లంటే పాటలు, డ్యాన్సులకే అనే ట్రెండ్ మారిపోతోంది. మిగిలిన భాషల్లో హీరోయిన్‌లకు ప్రాధాన్యత ఉండే సినిమాలు వస్తున్నా... వీటి సంఖ్య తక్కువగానే ఉంటోంది. కానీ అయితే... హీరోలతో సమానంగా అదరగొట్టేస్తున్నారు బాలీవుడ్ భామలు. సెంటిమెంట్ పండించడమే కాదు... సెంచరీ దాటిన స్పీడ్‌ తో బైక్‌ లనూ రయ్యిమనిపిస్తున్నారు.

కెరీర్ ప్రారంభంలో అందచందాలతో ఆకట్టుకున్న కత్రినా కైఫ్... రాన్రా నూ రెచ్చిపోయింది. డ్యాన్సుల్లో ఇరగదీయడమే కాదు... యాక్షన్ సన్నివేశాల్లోనూ కుమ్మేస్తోంది. ఏక్ థా టైగర్‌ లో సల్మాన్‌ తో కలిసి ఫైట్ సీన్స్ కూడా చేసిన కత్రిన... జిందగీ న మిలేగీ దుబారా లో అయితే... బైక్ డ్రైవ్ చేసింది. అది కూడా హ్రితిక్ రోషన్‌ని వెనకాల ఎక్కించుకుని మరీ.

చలాకీ చిన్నది బైక్ తోలితే ఎలా ఉంటుందో పరిణీతి చోప్రా చూపించింది కిల్ దిల్ మూవీ లో. పరిణీతి డ్రైవింగ్ చూసిన వారంత అమ్మడు చాలా స్పీడ్ అన్నారు అప్పట్లో. ఇక డేరింగ్ డాల్, ఫ్యాషన్ ఐకాన్ సోనమ్‌ కి కూడా డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. డోలీ కీ డాలీ సినిమాలో భారీ బైక్‌ పై చక్కర్లు కొట్టి ముచ్చట తీర్చకుంది సోనమ్.

క్యూట్‌ గా కనిపించే శ్రద్ధా కపూర్ కి కూడా బైక్ సవారీలో సూపర్ ఎక్స్‌ పీరియెన్స్ ఉంది. ఏక్ విలన్ మూవీలో ఈ ముద్దుగుమ్మ భారీభారీ బైక్‌ పై రైడ్ చేసింది. ఆ సినిమాలో హీరోని వెనుక కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేసినా... తనకు మాత్రం బైక్ బ్యాక్ సీట్లో కూర్చోవడమే ఇష్టమని చెబ్తోంది శ్రద్ధ.

మొత్తానికి బాలీవుడ్ భామలు బైకులపై భలే రైడ్లు కొట్టేస్తున్నారు కదూ.
Tags:    

Similar News