బాలయ్య కోసం ఆ రెయిన్ సాంగ్ రీమిక్స్!

Update: 2020-02-27 09:00 GMT
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  'లెజెండ్'.. 'సింహా' లాంటి హిట్ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. దీంతో ఈ హ్యాట్రిక్ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.  అటు బాలయ్య ఇటు బోయపాటి ఫ్లాపులలో ఉండడంతో ఈ సినిమా విజయం ఇద్దరికీ కీలకం కానుంది.  దీంతో బోయపాటి ఈ సినిమాను ఎలాగైనా సూపర్ హిట్ గా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారట.

ఈ సినిమాకు మంచి ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.  బాలయ్య ఇమేజికి సూట్ అయ్యే ఎనర్జిటిక్ ట్యూన్స్ ఇవ్వడానికి థమన్ కసరత్తు చేస్తున్నాడట.  అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్య కోసం ఒక ఓల్డ్ క్లాసిక్ సాంగ్ ను రీమిక్స్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట.   ఆ పాట బాలయ్యదే కావడం ఓ విశేషం.  1993 లో రిలీజ్ అయిన సూపర్ హిట్ చిత్రం 'బంగారు బుల్లోడు' సినిమాలో 'స్వాతిలో ముత్యమంత' పాటను ఇప్పుడు రీమిక్స్ చేస్తున్నారని సమాచారం. అప్పట్లో ఈ రెయిన్ సాంగ్ ఒక సూపర్ హిట్.  అప్పటి బాలీవుడ్ హాటీ రవీనా టాండన్ తో కలిసి బాలయ్య యమా జోరుగా వానలో స్టెప్పులు వేసి ప్రేక్షకులను మెప్పించారు.  ఆ పాటకు సంగీతం అందించినవారు రాజ్-కోటి.

థమన్ ఈ పాటను ఈ తరం ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా కొంచెం మారుస్తున్నారని అంటున్నారు. ఈ పాటను బాలయ్య - అంజలిపై చిత్రీకరణ జరుపుతారట.  ఈ వాన పాట కోసం ఒక అందమైన సెట్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ  రెయిన్ సాంగ్ సినిమాలో ఒక హైలైట్ గా ఉండబోతోందని అంటున్నారు.
Tags:    

Similar News