బాలయ్య రెండో మనవడు ఇడిగో

Update: 2018-03-25 04:21 GMT
నందమూరి బాలకృష్ణ మేఘాల్లో తేలిపోతున్నారు. తన రెండో కూతురు తేజస్విని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన లాంటిది రాలేదు కాని వార్త నిజమే కనక అభిమానులు కూడా సంతోషపడ్డారు. బాబు ఎలా ఉన్నాడో చూడాలన్న ఫాన్స్ ఆత్రుతకు తెరదించుతూ బాలయ్య స్వయంగా తన మనవాడి తొలి ఫోటోను షేర్ చేసుకోవడం వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. ఫోటోతో పాటు చిన్న సందేశాన్ని కూడా పెట్టారు బాలయ్య. “మరోసారి తాతయ్య అవుతున్నందుకు సంతోషంగా ఉంది. మా రెండో అమ్మాయి తేజస్విని - అల్లుడు శ్రీభరత్ మగబిడ్డకు తల్లితండ్రులైన శుభసందర్భంగా వాళ్ళకు దేవుడు సదా ప్రేమను, ఆనందాన్ని పంచుతూనే ఉండాలని కోరుకుంటున్నాను”

పెద్దమ్మాయి బ్రాహ్మణికి పుట్టిన దేవాన్ష్  అల్లరికి ఇప్పుడు ఈ బుడతడు కూడా జత కానున్నాడు. ఫోటోలో ప్రశాంతంగా నిద్ర పోతూ ముద్దొచ్చేలా ఉన్న భంగిమలో స్టిల్ ఇచ్చిన బాలయ్య మనవడు అందరికి నచ్చుతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నందున బాలయ్యకు ఫ్రీగానే ఉన్నారు. షూటింగ్ మొదలవ్వగానే బిజీగా మారిపోతారు కనక ఆ లోపు ముచ్చట తీర్చుకోవడానికి సమయం దొరికినట్టే. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉండాలి అనే దాని గురించి కూడా బాలయ్య తీవ్ర ఆలోచనలో ఉన్నట్టు టాక్. 
Tags:    

Similar News