పనిమనిషిగా మారిపోయిన లక్స్ పాప

Update: 2016-08-24 13:30 GMT
నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ నరసింహనాయడులో.. 'లక్స్ పాప' గా నటించిన ఆశా షైనీని టాలీవుడ్ ప్రేక్షకులు ఎవరైనా మరిచిపోగలరా? అయితే.. అందం ట్యాలెంట్ రెండూ ఉన్న ఈ భామకు అవకాశాలు అంతగా కలిసి రాలేదు. తర్వాత రకరకాలుగా పేర్లు మార్చేసుకుని బాగానే ట్రై చేసింది. మయూరి.. ఫ్లోరా షైనీ(అసలు పేరు)గా మారిన తర్వాత.. మళ్లీ ఆశా షైనీ దగ్గరే సెటిల్ అయింది.

ఈ మధ్య కాలంలో తెలుగులో పెద్ద ఆఫర్స్ ఏమీ రాలేదు కానీ.. నార్త్ లో మాత్రం ఆశాషైనీ ఇంకా సినిమాలు చేస్తూనే ఉంది. హిందీ పంజాబీ భాషల్లో నటిస్తున్న ఈ భామ.. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించింది. 'మెయిడ్ ఇన్ ఇండియా' ఎపిసోడ్ 1 అంతా ఈ లక్స్ పాప మీదే నడిచింది లెండి. ఓ పోష్ పనిమనిషిగా ఆశా షైనీ కనిపిస్తుందన్న మాట. గెటప్ దగ్గర నుంచి ప్రతీ విషయంలోనూ బాగా మాస్ గా ట్రై చేసినా.. బాగానే ఆకట్టుకుంది.

ఇంట్లో వైఫై ఉంటేనే పని చేస్తాననడం.. రెండు గంటలు నిద్ర.. ఒక గంట టీవీ కండిషన్లు పెట్టడం.. నెలకు 12వేలు జీతం అడగడం.. చివర్లో ఆమె భర్తని బాగా తెలిసిదానికి పలకరించడం.. ఎపిసోడ్ మొత్తం కామెడీతో అదరగొట్టేశారు. ఈ వెబ్ సిరీస్ ఫుల్ క్రెడిట్స్ ఆశా షైనీకి ఇవ్వాల్సిందే.
Tags:    

Similar News