ఏవండీ ఈయన హీరోనా? విలనా?

Update: 2016-09-29 07:30 GMT

ఒక్కొక్క స్టార్ ను చూస్తే మాత్రం వారు హీరోనా విలనా అనే సందేహం ఎవరికైనా వస్తుంది. అయితే బొంబాయి సినిమాలో అలరించిన అరవింద్ స్వామి మాత్రం.. తనకు ఏ రేంజ్ స్టార్డమ్ ఉన్నా కూడా ఎందుకోగాని పర్సనల్ లైఫ్‌ అంతకంటే ముఖ్యం అనుకున్నాడు. అందుకే తన కెరియర్ పీక్స్ లో ఉండగానే మనోడు రిటైర్ అయిపోయి వ్యాపారాల్లోకి దిగిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వెండితెరమీదకు వచ్చి విలన్ వేషాలు వేస్తున్నాడు.

కాకపోతే ఇప్పుడు మనోడు హ్యాండ్సమ్ విలన్ గా తెలుగులో రామ్ చరణ్‌ 'ధృవ' సినిమాలో అలరించడానికి సిద్దమైనప్పటికీ.. అసలు ఇతగాడిని చూస్తే మాత్రం ఎవ్వరూ విలన్ అని అనుకోరు. నిన్న సాయంత్రం జిమ్ లో కండలుపెంచుతూ అలా కనిపించాడు మన అరవింద్ స్వామి. చూడండి ఆ కండల రేంజ్ ఏ రేంజులో ఉంది. త్వరలో మొదలవ్వనున్న ఒక తమిళ సినిమా కోసం ఈ హడావుడి అని చెప్పుకొచ్చాడులే. అయితే మనోడు విలన్ గా చేస్తున్నాడా లేకపోతే హీరోగా చేస్తున్నాడా అనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. అది సంగతి.

తెలుగులో అరవింద్ స్వామి ధృవ సినిమా తరువాత ఏమైనా సైన్ చేస్తాడా అనుకుంటే.. ఎంతమంది ఎప్రోచ్ అయినా కూడా డేట్లు లేవు అని చెప్పేస్తున్నాడంట. అలాంటప్పుడు మనోడు హీరో పాత్రలే చేస్తాడని అనుకోవాలి మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News