మలైకా అలా అర్బాజ్ ఇలా.. కెవ్వు కేక

Update: 2016-11-04 01:30 GMT
బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్- మలైకా అరోరాల మధ్య విబేధాలు పొడచూపిన సంగతి మనకు తెలుసు. ఇందుకు కారణం కుర్ర హీరో అర్జున్ కపూర్ అనే విషయం కూడా మీడియా బైటపెట్టేసింది. రీసెంట్ గా మలైకా ఇంటి నుంచి రాత్రి 1.30కు బయటకు వచ్చిన అర్జున్ కపూర్ కెమేరా కంటికి చిక్కాడు కూడా.

విడిపోతారనే న్యూస్ వచ్చినప్పటి నుంచి విడివిడిగానే ఉంటున్నారు అర్బాజ్ ఖాన్- మలైకాలు. మలైకా-అర్జున్ తో వ్యవహారం చక్కబెడుతుంటే.. ఇటు అర్బాజ్ కూడా స్పీడ్ పెంచేశాడు. తన లాంగ్ టైం గాళ్ ఫ్రెండ్ అయిన యెల్లో మెహ్రాతో పార్టీలు చేసుకుంటున్నాడు. గోవాలో ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి అర్బాజ్ దివాలీ సెలబ్రేషన్స్ చేస్తే.. అందులో కూడా యెల్లో మెహ్రా కనిపించింది. ఇంతకీ ఎవరీ ఎల్లో మెహ్రా అని తెలుసుకోవాలని ఉందా?

ఫియెస్టా హాస్పిటాలిటీ గ్రూప్ వ్యవస్థాపకురాలే యెల్లో మెహ్రా. ఈమె ఓ మోడల్- చెఫ్- ఇంటీరియర్ డిజైనర్. గతంలో ఈమెకు సంబంధించిన ఒకటీ అరా ఫోటోలను మాత్రమే షేర్ చేసే అర్బాజ్ ఖాన్.. ఇప్పుడు ఫ్యామిలీ పార్టీల్లోనూ ఈమెను జత చేస్తున్నాడంటే.. రిలేషన్ నాలుగడుగులు ముందుకు పడ్డట్లే ఉంది కదూ!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News