ఆస్ట్రియా థెరపీ ఏమైంది అనుష్కా?

Update: 2019-02-23 07:32 GMT
సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ ఈమధ్య స్వర్గస్తులు కావడంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఇలా నివాళులు అర్పించిన వారిలో అనుష్క కూడా ఉంది.  కోడి రామకృష్ణ - అనుష్క కాంబినేషన్లో 'అరుంధతి' లాంటి సూపర్ హిట్ ఫిలిం తెరకెక్కిన సంగతి తెలిసిందే.  నటిగా అనుష్కను ఒకేసారి పది మెట్లు పైకెక్కించిన చిత్రమది.   ఆ అనుబంధంతోనే అనుష్క తనకు మంచి బ్రేక్ ఇచ్చిన కోడి రామకృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించడమే కాకుండా అయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఈ సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో కూడా కనిపించాయి.  కానీ ఈ ఫోటోలు మరోరకంగా నెటిజనులకు హాట్ టాపిక్ అయ్యాయి. కారణం అనుష్క మళ్ళీ బొద్దుగా కనిపించడమే.  ఓ పది రోజుల క్రితం అనుష్క స్లిమ్ అవతారంలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  ఆస్ట్రియా దేశంలో అనుష్క న్యాచురల్ పద్ధతుల్లో తీసుకున్న వెయిట్ లాస్ థెరపీ చక్కగా పనిచేసిందని.. అనుష్క ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ సంబరపడ్డారు.

కానీ ఇప్పుడు ఈ ఫోటోలలో మాత్రం అనుష్క ఒక బొద్దుగానే ఉంది.  మరి ఆ స్లిమ్ము ఫోటోల సంగతేంటని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. అవి ఫోటోషాప్ చేసిన ఫోటోలని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  మరి ఇంతకుముందు లాగే ఉన్నప్పుడు ఆస్ట్రియా థెరపీ ఏమైంది అనుష్కా..?
Tags:    

Similar News