అనుపమ ఎంట్రీ అలాగే ఉంటుందా?

Update: 2018-06-21 04:25 GMT
ప్రతి దర్శకుడికి ఓ ప్రత్యేక శైలి ఉంటుంది. కొన్ని విషయాల్లో అది చాలా పర్టిక్యులర్ గా ఉంటుంది. ఈ విషయం ఆ డైరెక్టర్లు పట్టించుకుంటారో లేదో కానీ వారిని అభిమానించే ఫ్యాన్స్ మాత్రం చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టు కరుణాకరన్ కూ ఓ స్పెషల్ స్టయిల్ ఉంది. ఆయన సినిమాల్లో గ్యారంటీగా ప్రేక్షకులకు గుర్తుండిపోయేది హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్.

కరుణాకరణ్ మొదటి సినిమా తొలిప్రేమలో హీరోయిన్ కీర్తిరెడ్డి ఇంట్రడక్షన్ సీన్ ను ఇప్పటికీ అభిమానులు మరిచిపోరు. ప్రస్తుతం కరుణాకరన్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో తేజ్.. ఐలవ్ యూ సినిమా తీస్తున్నాడు. ఇందులో కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. సాధారణంగా కరుణాకరన్ సినిమాల్లో హీరోయిన్లంతా ఇంట్రడక్షన్ సీన్ లో వైట్ డ్రస్ లోనే కనిపించారు. ఇప్పుడు అనుపమను కూడా అదే స్టయిల్లో ఉంటుందా... లేక మారుతుందా అన్నదానిపై నెటిజన్లలో ఆసక్తి పెరిగింది. ఆమెను ఈ సినిమాలో ఎంత అందంగా చూపించబోతున్నాడా అని అభిమానులంతా ఆసక్తిగా చూస్తున్నారు.

అసలే అందాల సుందరులను హీరోయిన్ గా తీసుకునే కరుణాకరన్ వారిని తెల్లటి డ్రస్ లో ఓ దేవతలా ప్రొజెక్ట్ చేస్తాడు. ఆ ఇంట్రడక్షన్ సీన్ చూసి చాలామంది మాయలో పడిపోతారు. ఆయన తరవాత తీసిన యువకుడులో భూమిక.. డార్లింగ్ లో కాజల్.. బాలులో శ్రేయ.. ఉల్లాసంగా ఉత్సాహంగా స్నేహ ఉల్లాల్ ఇలాగే పాలనురగ లాంటి తెల్లటి డ్రస్ లో మెరిసిపోతూ స్క్రీన్ పై కనిపించారు.
Tags:    

Similar News