మళ్ళీ పెళ్ళికి రెడీ అయిన ఏంజెలినా?

Update: 2017-04-22 11:00 GMT
హాలీవుడ్ హాటెస్ట్ అండ్ లవ్ లీ కపుల్.. బ్రాడ్ పిట్ అండ్ ఏంజెలినా జోలీ విడాకులకు ఫైల్ చేసి ప్రపంచం మొత్తం అభిమానులును నిరాశ పరిచారు. వీళ్ళు ఇప్పుడు కలిసి ఉండటం లేదు అనే విషయం తెలిసిందే. వీళ్ళ ప్రేమ బెడిసి కొట్టిన కొద్ది టైమ్ లోనే ఏంజెలినా ఇంకో హాండ్సమ్ తో డేటింగ్ చేస్తోందని ఇప్పుడు హాలీవుడ్ అంతా కొడై కూస్తుంది.

ఏంజెలినా అందంతో పాటు సేవ గుణం కూడా దండి గా ఉంటుంది. ఆమె పిల్లల దత్తత గురించి ప్రపంచం మొత్తం తెలుసు. మంచి నటి.. డైరెక్టర్ కూడాను. అందుకే ఇప్పుడు అమ్మడికి టైమ్ అసలు సరిపోవడం లేదు. సినిమాలు, పిల్లలు, సేవ కార్యక్రమాలు మధ్య చాలా రహస్యం గా డేటింగ్ ఏర్పాట్లు చేసుకొంటుందట. ఈ కొత్త బిజినెస్ మ్యాన్ లండన్ లో ఒక పేరు మోసిన కంపెనీ ఓనర్ అని.. రాజకీయ పలుకుబడి ఉన్న అతణ్ణి ఇంకా ఏంజెలినా లాగే సేవ భావం కలిగిన మనిషి అని చెబుతున్నారు అక్కడ మీడియా. వీళ్ళు ఇద్దరు కిందట ఏడు లండన్ లో కలిశారని.. వాళ్ళ అబిప్రాయాలు కలిసి ఇప్పుడు డేటింగ్ నుండి వివాహం వరుకు వచ్చింది అని తెలుస్తుంది.

బ్రాడ్ పిట్ తో సఖ్యత లోపించి అతనికి విడాకులు ఇచ్చింది. అతను తాగుడుకి అలవాటు పడి డిప్రెషన్ తో ఉంటున్నాడు అని.. పిల్లలును సరిగా చూసుకోవడం లేదు అని చెప్పింది. ఈ విమర్శ బ్రాడ్ పిట్ కి బొత్తిగా నచ్చలేదు. ఇప్పుడు ఏంజెలినా ఒక బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ చేస్తే.. మరి ఆ పిల్లలను ఎవరు చూసుకుంటారో??

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News